వెంకీని మంకీ చేసినందుకు అభిమానులు డైరెక్టర్ పై ఆగ్రహం...
వెంకటేష్ హీరోగా రూపొందిన 'నాగవల్లి" చిత్రం ఇటీవల విడుదలయ్యింది. ఈ చిత్రం వెంకీ అభిమానులను బాగా హర్ట్ చేసింది. దర్శకుడు పి వాసు తమ అభిమాన హీరో వెంకటేష్ పాత్రలను సరిగ్గా రూపొందించలేకపోయాడని ఆ అభిమానులు భావిస్తున్నారట. కచ్చితంగా చెప్పాలంటే విక్టరీ వెంకటేష్ చేత 'అఘోరా" గా గెటప్ వేయించి చిత్రీకరించిన ఆ సీన్ బాగోలేదని, ఈ క్యారెక్టర్ ను పిచ్చివాడి క్యారెక్టర్ లా దర్శకుడు రూపొందించాడని అభిమానులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి క్యారెక్టర్లు క్రియేట్ చెయ్యొద్దని, మీరోని మైండ్ లో పెట్టుకుని క్యారెక్టర్లు క్రియేట్ చేయాలని దర్శకుడు పి వాసుకు వెంకీ అభిమానులు వార్నింగ్ ఇచ్చారని సమాచారం.


Click it and Unblock the Notifications











