వెంకీని టెన్షన్ పెడుతున్న సల్మాన్ ఖాన్
వెంకీని సల్మాన్ ఖాన్ భయ పెట్టడం ఏమిటి అని డౌట్ పడుతున్నారా? మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది నిజం. వెంకీ ప్రస్తుతం మలయాళ చిత్రం 'బాడీగార్డ్"కి రీమేక్‌గా రూపొందుతున్న 'గంగ ది బాడీగార్డ్" అనే చిత్రంలో నటిస్తున్నారు. త్రిష వెంకీ సరసన రొమాన్స్ చేస్తోంది.
అయితే ఇదే సినిమా సల్మాన్ ఖాన్-కరీనాకపూర్ జంటగా హిందీలో రీమేకై నేడు(ఆగస్టు 31, 2011) ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నడూ లేనంతగా 120 థియేటర్లలో రిలీజ్ చేయడం ఓ విశేషం. ఒక్క హైదరాబాద్‌లోనే రంజాన్ పర్వదినం సహా సల్లూభాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని 52 థియేటర్లలో రిలీజ్ చేశారు.
సల్మాన్ బాడీగార్డు చిత్ర ప్రభావం వెంకీ చిత్రంపై పడే అవకాశాలున్నా యని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకే కథ, కథనంతో రూపొందిన చిత్రం కావడం తో ప్రేక్షకులకు ఒకే సినిమా చూశామన్న ఫీలింగ్ ఉంటుందేమోననేది క్రిటిక్స్ అభిప్రాయం. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ఆశించిన స్థాయి హిట్లు లేక సతమతం అవుతున్న వెంకటేష్ కు సల్మాన్ రూపంలో భయం వెంటాడుతోంది. కొంపతీసి సల్మాన్ ఖాన్ ఏపీలో కలెక్షన్లు కొల్లగొడితే వెంకీకి ఏమీ మిగలవు అనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











