షాడో షూటింగ్: ఆస్ట్రేలియాలో వెంకీ అండ్ టీం

By Bojja Kumar

విక్టరీ వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో 'షాడో' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఈ మేరకు వెంకీతో పాటు ముఖ్య తారాగణం, టెక్నీషియన్స్ ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా వెళ్లారు. సినిమాలోని ముఖ్య తారాగణం మీద ఇక్కడ పలు యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారు. వెంకటేస్ ఈ చిత్రంలో డాన్ పాత్రలో కనిపించబోతున్నారు.

యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తాప్సి నటించనుంది. హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. వెంకీ డాన్ పాత్ర అనగానే ఈ సినిమా సిరీయస్ గా సాగుతుందనుకుంటే పొరపాటే. ఈ సినిమాలో కామెడీ టచ్ కూడా మెండుగా ఉంటుందని అంటున్నారు ఈచిత్రానికి రచయితగా పని చేస్తున్న కోన వెంకట్. సినిమా పేరుకు తగిన విధంగానే మాఫియా బ్యాగ్రౌండ్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఫన్నీగా ఉంటుందని ఆయన తెలిపారు.

మరో వైపు వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. జర్నీ ఫేం అంజలి వెంకీకి జోడీగా నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈచిత్రంలో మరో హీరో పాత్రలో నటిస్తున్నాడు, అతనికి జోడీకి సమంత ఎంపికైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X