గంగ లేకుండానే వస్తున్న వెంకీ...
విక్టరీ వెంకటేష్ హీరోగా 'గంగా - ది బాడీగార్డ్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ సరసన త్రిష లీడ్ రోల్ చేస్తుండగా, సలోని ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించి తొలి పోస్టర్ ఇటీవల రిలీజైంది. అయితే పోస్టర్ లో ఉన్న టైటిల్లో తొలి నుంచి ప్రచారం చేస్తున్నట్లుగా 'గంగా" అనే పేరు మాత్రం లేదు. కేవలం బాడీగార్డు అని మాత్రమే ఉంది. దీంతో సినిమా టైటిల్ మార్చినట్లు స్పష్టం అవుతోంది.
'బాడీగార్డు" ఒరిజినల్ వర్షన్ తొలుత మళయాళంలో రూపొందగా...అదే పేరుతో హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేసి మంచి హిట్ సాధించారు. ఈ నేపథ్యంలో 'బాడీగార్డ్" పేరు జనాల నోళ్లలో బాగా పాపులర్ అయింది. తెలుగులో కూడా అదే పేరు అయితేనే బాగుటుందని దర్శక నిర్మాతలు భావించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
నవంబర్ 23న సినిమా విడుదల చేయాలనుకున్నప్పటికీ పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తికానందున డిసెంబర్ 2కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











