హృతిక్ రోషన్ గెటప్ లో వెంకటేష్
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ మెహర్ రమేష్ దర్శకత్వంలో 'షాడో' చిత్రం చేస్తున్న సంగతి. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ వినాయక ఉత్సలకు సంబంధించిన సాంగ్ చిత్రీకరిస్తున్నారు. యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం...వెంకటేష్ ఈ సాంగులో... అగ్నిపథ్ సినిమాలో 'దేవ శ్రీ గణేషా' సాంగులో హృతిక్ రోషన్ గెటప్ మాదిరి ఉంటుందని తెలుస్తోంది.
వెంకీ ఇందులో డాన్ పాత్ర పోషిస్తున్నారు. ఈచిత్రం టీజర్ అక్టోబర్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈచిత్రానికి స్క్రిప్టు రైటర్ గా పని చేస్తున్న కోన వెంకట్ స్పష్టం చేసారు. వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది. ప్రపంచంలోని ఆరు వేర్వేరు ప్రదేశాల్లో ఈచిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
సక్రాంతికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్.


Click it and Unblock the Notifications











