గోపాల గోపాల: వెంకటేష్ బర్త్ డే స్పెషల్ ఇలా (ఫోటోస్)
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘గోపాల గోపాల' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. రేపు(డిసెంబర్ 13) వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన అతని స్టిల్స్ విడుదల చేసారు.
సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో కేవలం మూడే పాటలు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఐదు నుంచి ఆరు పాటలు మన సినిమాల్లో ఉంటూంటాయి. అందులోనూ వెంకటేష్, పవన్ లాంటి వారి చిత్రాలంటే ఆడియోపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది మరీ మూడే అనేది ఆశ్చర్యకరమైన విషయం అంటున్నారు. అయితే సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
స్లైడ్ షోలో ‘గోపాల గోపాల' చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు...

అంచనాలు భారీగా
విక్టరీ వెంకటేష్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్‌గా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

రీమేక్
హిందీ చిత్రం ‘ఓ మై గాడ్'కు రీమేక్ ఇది. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మాతలు. సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

స్టోరీలైన్
దేవుడంటే నమ్మకం ఓ వ్యాపారి దేవుడి బొమ్మలమ్మే బిజినెస్ చేస్తుంటాడు. భూకంపలో తన దుకాణం ధ్వంసం అవుతుంది. దేవుడి లీలల వల్ల జరిగే ఇలాంటి వాటికి ఇన్సూరెన్స్ కవర్ కాదని చెప్పడంతో...దేవుడిపై కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ.

నటీనటులు
ఈ చిత్రంలో మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షాపంత్, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











