»   » పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీలో వెంకీ గెస్ట్ రోల్

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీలో వెంకీ గెస్ట్ రోల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సారథి స్టూడియోస్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా వెంకీ, పవన్‌లపై కొన్ని సీన్లు షూట్ చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్, వెంకటేష్ మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో వెంకీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గోపాల గోపాల' మూవీలో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కేవలం వెంకటేష్ కోసమే ఈ సినిమా చేశానని గతంలో పవన్ ప్రకటించారు కూడా.

Venkatesh Guest role in Pawan Kalyan

ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీలో ఓ చిన్న గెస్ట్ రోల్ కోసం వెంకటేష్‌ను సంప్రదించగా ఏమాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పాడట వెంకీ. సారథి స్టూడియోస్‌లో ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీన్ సందర్భంలోనే వెంకీ గోస్ట్ రోల్ ఎంట్రీ ఉంటుందని, ఈ సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయని సమాచారం.

అయితే వెంకీ గెస్ట్ రోల్ విషయమై ఇప్పటి వరకు అఫీషియల్ సమాచారం రాలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Victory Venkatesh's guest role in Pawan Kalyan -Trivikran movie, shoot is going on today. An hilarious sequence on Pawan Kalyan & Venkatesh (cameo) is currently being filmed at a special set in Hyd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu