twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని నేను గొప్పలు చెప్పిన దాసరినారాయణ రావు

    By Sindhu
    |

    అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రోత్సవాలకు బాలలే వ్యాఖ్యాతలుగా ఉండటం విశేషం. దాసరి నారాయణరావును ఆహ్వానిస్తే.. తాను దర్శకుడినని, 140 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పొందానని, గొప్ప దర్శకుల్లో తానూ ఒకడినని చెబుతూ తెలుగువారికి అన్యాయం జరుగుతుందని వాపోయారు. హిందీ వారికి ఉన్న ప్రాధాన్యత తెలుగువారికి లేదని మండిపడ్డారు. అందుకే తెలుగువారిపై మరింత దృష్టిసారించాలని కోరారు.

    ఆ తర్వాత గీతారెడ్డి మాట్లాడుతూ సోదరసమానులు, దాసరిగారు ఆవేశపూరితంగా మాట్లాడారు. అందరూ కలిసి కృషిచేసి చలనచిత్రోత్సవాలను జరుపుతున్నారు. ప్రభుత్వంలోని ప్రతిశాఖా హైదరాబాద్ కార్పొరేషన్ కృషిని సమర్థించారు. అంబికా సోనీ మాట్లాడుతూ తెలుగువారికి అన్యాయం ఎక్కడా జరగలేదు. 2007లో తెలుగు సినిమా 'అమూల్యం" కు అవార్డు దక్కిందంటూ ఫెస్టివల్ ఛైర్ పర్సన్ నందితాదాస్‌ను మెచ్చుకున్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఆమెపై పెట్టిన పనిని సఫలం చేశారని అంబికా సోని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జరిగిన నృత్యాలు, మిమిక్రీ, ఇంద్రజాలం అందరి ఆకట్టుకున్నాయి.

    ఇంకా విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఆయన రాగానే ఒక్కసారిగా అక్కడి వాతావరణం కేరింతలతో మునిగింది. చాలామంది పిల్లలు ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. కానీ ఆ తర్వాత ఇలియానా వచ్చిన వెంటనే ఆమె ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. ఏదైనా సినిమా గ్లామరే కారణమని.. దాసరి వ్యాఖ్యానించడం దానికి ఆయన పక్కన ఉన్నవారు అవుననడం విశేషం. ఇకపోతే పోలీసు అధికారులు సైతం తమ పిల్లలను వెంకటేష్, ఇలియానాల దగ్గరకు తీసుకెళ్ళడం ఇందులో మరో ఆసక్తికరమైన అంశం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X