కమల్ 'మర్మయోగి'లో వెంకటేష్?

By Staff

Venkatesh
'చింతకాయల రవి' వెంకటేష్‌ 'మర్మయోగి'లో నటించబోతున్నారు అనే వార్త టాలీవుడ్,కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కమల్‌హాసన్‌ దర్శకత్వంలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం వెంకటేష్‌ని కమల్‌ సంప్రదించినట్లు విశ్వసనీయ సమాచారం. పాత్ర తీరుతెన్నుల్నీ, కథాంశాన్నీ కూడా వెంకీకి వివరించారని తెలుస్తోంది. దాంతో వెంకటేష్ నటించే తొలి త్రిభాషా చిత్రమిదే అవబోతోంది. గతంలో వెంకీ నటించిన చిత్రాలు తమిళంలోకి అనువాదమయ్యాయి.. అలాగే ఆయన కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించారు. అయితే అవేమీ భాక్సాఫీస్ వద్ద పెద్ద ఫలితాన్ని చూపించకపోవటంతో అటు వైపు వెంకీ చూడటం మానుకున్నారు. ఇక మర్మయోగి'లో త్రిష కథానాయిక. శ్రియ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.

అలాగే 'చింతకాయల రవి' అక్టోబరు 1న విడుదలకు రెడీ అవుతోంది. దీని తరవాత వెంకటేష్‌ నటించే చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'. 'గమ్యం' దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) దీన్ని రూపొందిస్తారు. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఇందులో వెంకటేష్‌ పాత్ర, కథాంశం కొత్త పంథాలో ఉండబోతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం 2009 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే తర్వాత వెంకటేష్‌ - శ్రీను వైట్ల కలయికలో కూడా ఓ చిత్రం ఉంటుంది.

ఇక కమల్ వెంకీ ని తన మర్మయోగి లోకి తీసుకోవటానికి కారణం తెలుగు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే అని తెలుస్తోంది. వరస హిట్లతో దూసుకుపోతున్న వెంకీ తమ ప్రాజెక్టులో ఉంటే తెలుగు వారు నేటివిటీ ఫీలయి తమ సినిమా అని పూర్తి స్ధాయిలో ఫీలవుతారని కమల్ ఆలోచన అని తెలుస్తోంది. అలాగే ఇంకా పాపులర్ బాలీవుడ్ నటులను కూడా కొద్ది మందిని ఈ ప్రాజెక్టు లో ఇన్వాల్వ్ చేయటానికి కమల్ ప్రయత్నిస్తున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X