విలన్ పాత్రలు చేసేందుకు సిద్దం ...వెంకటేష్
"నాగవల్లి చిత్రంలో పోషించిన రాజు పాత్రకు కొంత నెగిటివ్ ఛాయలుంటాయి. ప్రయోగాత్మకంగా చేశాను. మంచి స్పందన వచ్చింది. ఇదో మార్పుగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో మంచి కథ ఉంటే విలన్ పాత్రలు చేసేందుకూ సిద్ధమే. నిజానికి సూపర్ హిట్ సినిమాని నిర్వచించడం అంత తేలిక కాదు. కొత్తదనం, ఎంతో కొంత వైవిద్యం ఉంటే జనం ఎప్పుడూ ఆదరిస్తారు. నా దృష్టిలో హిట్టైన సినిమా అంటే అదే అన్నారు" వెంకటేష్. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో...చిత్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ఎంతోకొంత త్యాగం చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వెంకటేష్..తేజ దర్శకత్వంలో సావిత్రి అనే చిత్రం చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ చిత్రం ఓకే అయినట్లు సమాచారం.
వెంకటేష్ నాగవల్లి పి వాసు చంద్రముఖి బెల్లంకొండ సురేష్ nagavalli venkatesh anushka bellamkonda suresh p vasu


Click it and Unblock the Notifications