twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దొంగల్ని నమ్మెద్దు: పవన్ పవిత్ర కార్యంలా...(వెంకీ మాట)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో తెరరెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘గోపాల గోపాల' చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ మీడియా సమావేశంలో సినిమా గురించిన విశేషాలు చెప్పుకొచ్చారు. కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సురేష్ బాబు, శరత్ మరార్ నిర్మాతలు. హిందీలో విజయవంతమైన ఓ మైగాడ్ చిత్రానికి రీమేక్ ఇది.

    సినిమా కాన్సెప్టు గురించి వివరిస్తూ...దేవుడెక్కడో లేడు. ఆయన ద్వారానే మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం. మనలోనే ఆయన మమేకమై వున్నాడు అనే జీవన తాత్వికతను గోపాల గోపాల చిత్రంలో ఆవిష్కరించడం జరిగింది. వినోదంతో పాటు నేటి సమాజానికి చక్కటి సందేశాన్నందించే చిత్రమిది. తెలుగు నేటి విటీకి తగిన విధంగా సినిమాలో చాలా మార్పులు జరిగాయి. కొన్ని కొత్త సీక్వెన్స్ జత చేశాం. హిందీకంటే తెలుగులో ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా వుంటుందన్నారు.

    పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించడంపై మాట్లాడుతూ.....పదేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేద్దామనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల వీలుకాలేదు. గోపాల గోపాల సినిమాలో కృష్ణుడి పాత్రకు ఎవరిని తీసుకోవాలని ఆలోచించినప్పుడు అన్నయ్య సురేష్‌బాబు పవన్‌కల్యాణ్ పేరును సూచించారు. ఆధ్యాత్మిక విషయాల్లో నాకు, పవన్‌కల్యాణ్‌కు కొన్ని సారుప్యతలుంటాయి. ఈ అంశం కూడా మేమిద్దరం కలిసి నటించడానికి ఓ కారణమైంది. తాను చేస్తున్నది దేవుడి పాత్ర కాబట్టి ఈ సినిమాను ఓ పవిత్ర కార్యంలా భావించారు పవన్‌కల్యాణ్. ఆయన కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది అన్నారు.

    Venkatesh interview about Gopala Gopala

    ‘గోపాల గోపాల'పై ఫిర్యాదులు అందిన నేపథ్యంపై స్పందిస్తూ...ఒకరి విశ్వాసాల్ని కించపరిచేలా సినిమా తీస్తే అది తప్పవుతుంది. అలాంటి అంశాలేవీ ఈ సినిమాలో వుండవు. ప్రజల విశ్వాసాల్ని కాదు.. మూఢ నమ్మకాల్ని ప్రశ్నించే చిత్రమిది. కాబట్టి దీనిపై ఎలాంటి వివాదాలు రావని అనుకుంటున్నాను. ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకునే దొంగ స్వామిజీల్ని నమ్మొద్దు..నిజమైన గురువుల్ని నమ్మితే తప్పుకాదు అనే అంశాన్ని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు.

    తనలోని ఆధ్యాత్మిక కోణం గురించి స్పందిస్తూ...ప్రతి మనిషికి దేవుడు గట్టిగా ఒక్కటిస్తాడు. అప్పుడు మనం పరిగెత్తి దేవుడా ఎక్కడున్నావు నువ్వు అని అన్వేషణకు బయల్దేరుతాం. ఎప్పుడైతే దేవుడి ఉనికిని, దాని తాలూకు ఓ ఉన్నతమైన సత్యాన్ని తెలుసుకోవాలనే అశాంతి మనలో చెలరేగిందో అప్పుడే దానికోసం మనం వెతకడం ప్రారంభిస్తాం. నేను కూడా దైవం కోసం ఒకానొక సమయంలో రోదించాను. ఆ క్రమంలోనే ఆధ్యాత్మికత వైపుకు మళ్లాను. పట్యిక్యులర్ గా ఒక దేవుడిని నమ్మును. ఏదో ఒక శక్తి ఉందని నమ్ముతాను. మనలోనే దేవుడు ఉన్నాడని నమ్ముతాను అన్నారు వెంకటేష్.

    ఎప్పుడైతే మనం స్టార్ అనుకుంటామో...ఇక మన పని అయిపోయినట్లే. మంచినటుణ్ణి అనే భావనతో సినిమాలు చేయాలి. స్టార్ హోదా తాత్కాలికమైనది. దానిగురించి నేనెప్పుడూ ఆలోచించను. క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన పరేష్ రావల్ హిందీలో పోషించిన పాత్రను తెలుగు నేను చేయడానికి కారణం అదే అని వెంకటేష్ చెప్పుకొచ్చారు. షూటింగ్‌లో వున్నప్పుడే కొన్ని సినిమాల భవిష్యత్తు తెలిసిపోతుంది. ఏదో ఒప్పుకున్నాం కాబట్టి చేయాల్సి వస్తుంది. సీన్ మనకు నచ్చకపోయినా... బాగా వచ్చిందని యూనిట్ అంతా చప్పట్లు కొడుతుంటే వారితో మనం వంత పాడాల్సివుంటుంది. అసలు నిజమైన నటన అంటే అదేనేమో అంటూ చమత్కరించారు.

    English summary
    Check out: Venkatesh interview about Gopala Gopala movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X