తేజ దర్శకత్వంలో వెంకటేష్ వికలాంగుడిగా నటిస్తున్నారా..
నాగవల్లి సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ చేయనున్న సినిమా సావిత్రి. నాగవల్లిలో మూడు పాత్రలతో అలరించిన వెంకటేష్ వికలాంగుడిగా నటించడం ఏంటి అని మీ సందేహమా కలుగుతుందా ఇది నిజమే నండి బాబూ. లక్ష్మి, మల్లీశ్వరి, నాగవల్లి అంటూ ఇలా ఫీమేల్ టైటిల్స్ తో సినిమాలు చేసిన వెంకీ త్వరలో సావిత్రి అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక పోతే ఈసినిమాకి దర్శకత్వం వహించేది ఎవరా అని అనుకుంటున్నారా. గతంలో జయం, నువ్వు నేను, నిజం, అవునన్నా కాదన్నా లాంటి సినిమాలు తీసి, గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా వున్న దర్శక, నిర్మాత తేజ ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు.
ఈసినిమా జనవరి 17న షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేయడం జరిగింది. ఐతే కోన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం ఆమె స్ధానం లో నయనతార పేరును పరిశీలిస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు. ఈసినిమాలో వెంకీ వికలాంగుడిగా నటిస్తున్నారు. వికలాంగుడిగా వెంకీ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలంటే సినిమా వచ్చినంత వరకు ఆగాల్సిందే. గతంలో వెంకటేష్, నయనతార ఇద్దరూ కలసి లక్షీ, తులసి లాంటి హిట్ సినిమాలలో నటించారు.


Click it and Unblock the Notifications











