»   » మహేస్ ‘దూకుడు’ తెరవెనుక విక్టరీ వెంకటేష్..!

మహేస్ ‘దూకుడు’ తెరవెనుక విక్టరీ వెంకటేష్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'దూకుడు" చిత్రం సెప్టెంబర్ లో విడుదలకాబోతుంది. ఇప్పటికే విడుదలై ఈ చిత్రం పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రానికి వక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 'నమో వెంకటేశ" చిత్రంలో వెంకటేష్ కి మంచి హిట్ ని అందించిన శ్రీను వైట్ల ఇప్పుడు తన దర్శకత్వంలో వస్తున్న 'దూకుడు" చిత్రానికి వాయిస్ ఓవర్ ని ఇవ్వమని వెంకీని అడగడంతో వెంకీ అందుకు సరే అన్నాడట.

ఎన్నాళ్ళగానో ఊరిస్తున్న వెంకటేష్ తో మహేష్ బాబు మల్టీస్టారర్ చిత్రం తీయబోతున్న సంగతి కూడా విదితమే. కొత్త బంగారు లోకం ఫేమ్ అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి బల్క్ డేట్స్ ఇవ్వటానికి మహేష్ సిద్దపడ్డాడని సమాచారం. మల్టిస్టారర్ ఫిల్మ్ లలో ఇదో ట్రెండ్ సెట్టర్ అవుతుందని చెప్తున్నారు. దాంతో శ్రీనువైట్ల, మహేష్ ల చిత్రానికి వెంకీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓకే చెప్పారని తెలిసింది..

English summary
Venkatesh has good relation with director Srinu Vytla. They both worked for Namo Venkatesh. Srinu Vytla made Venkatesh to offer a voice over for Dookudu. He accepted and now film will have Venkatesh behind the screen narrating the Mafia backdrop.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X