KGF పై నా అభిప్రాయం కరెక్ట్.. కానీ నన్ను తిట్టడం సరికాదు..వీడియో రిలీజ్ చేసిన వెంకటేష్ మహా!

ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కేజీఎఫ్, ఆ చిత్రాన్ని తీసిన ప్రశాంత్ నీల్‌పై కేరాఫ్ కంచరపాలెం సినిమా తీసిన దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.వెంకటేష్ మహాను టార్గెట్ చేసుకొని #InsecureLoaferVenkateshMaha, #AttentionBeggerVenkateshMaha అనే హ్యాష్ ట్యాగ్స్‌తో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ మహా తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే?

నీచ్ కమీన్ కుత్తే గాడు అంటూ

నీచ్ కమీన్ కుత్తే గాడు అంటూ

వెంకటేష్ మహా డిబేట్‌లో మాట్లాడుతూ... గోల్డ్ మైన్ అంటూ చితక్కొట్టారు. నేను ఆ సినిమా పేరు చెప్పను. ఓ తల్లి తన కొడుకుని నీవు ఎప్పటికైనా గొప్పవాడై అందరికి మంచి చేయాలని కోరుకొంటుంది. తల్లి కొంత బంగారం కావాలని కోరుకొంటుంది. గోల్డ్ మైన్‌లో పనిచేసే కార్మికులను హీరో ఉద్దరిస్తాడు. చివరకు మొత్తం బంగారాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తాడు.

అలాంటి హీరో ఎంత నీచ్ కమీన్ కుత్తే గాడు కాకపోతే.. చివరకు వేల మందికి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు ఇచ్చి.. బంగారం మొత్తం సముద్రం పాలు చేస్తాడు. అలాంటి నీచ్ కమిన్ కుత్తేగాడు ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు. అర్ధం పర్ధం లేకుండా అలాంటి కథలను సినిమాలుగా తీస్తే.. మనం చప్పట్లు కొటుతున్నాం.

ఇలాంటి సినిమాలు తీయడం ఇదెక్కడి న్యాయం అనేలా ప్రశ్నించాడు. కేజీఎఫ్ సినిమా కథపై ఆవేశంగా తన అక్కసును వెళ్లగక్కాడు. ఆవేశంగా యాంకర్ మాటలకు అడ్డుపడుతూ.. తన అసహనాన్ని వెళ్లగక్కాడు.

కల్పిత పాత్రను ఉద్దేశించి చేసిన మాటలు

కల్పిత పాత్రను ఉద్దేశించి చేసిన మాటలు

నేను ఓ వర్గం వాదనను నేను వినిపించాను. నా వాదనను సపోర్ట్ చేస్తూ చాలా మంది మెసేజ్ పెట్టారు. వారందరి తరపున నా ఒపినీయన్. కానీ నేను మాట్లాడిన భాష సరికాదు. అలా మాట్లాడినందుకు నేను క్షమాపణ చెబుతున్నాను. మా మధ్య జరిగిన చర్చను పరిగణనలోకి తీసుకోవాలి. ఓ సినిమాలో ఓ కల్పిత పాత్రను ఉద్దేశించి చేసిన మాట.

ఆ పాత్ర నాకు నచ్చలేదు. అంతేగానీ.. ఆ పాత్రను చేసిన నటుడిని, ఆ పాత్రను సృష్టించిన దర్శకుడిని ఉద్దేశించి నేను కామెంట్ చేయలేదు. ఒక వ్యక్తికి ఆపాదించడం సరికాదు. మీరు ఓ వ్యక్తిని టార్గెట్ చేసినట్టు మీరు అనుకొంటున్నాను అని వెంకటేష్ మహా అన్నారు.

నన్ను అసభ్యంగా దూషిస్తున్నారు అంటూ

ప్రముఖ యాంకర్ నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్‌లో.. ఒక ఎమోషనల్ మూమెంట్‌లో ఓ కల్పిత పాత్రను దూషించాను. కానీ అది రియల్ పర్సన్ అయినటు వంటి నన్ను నాపై ప్రభావం చూపిస్తున్నది. నన్ను ఎన్నో రకాలుగా అసభ్యంగా దూషించడం, ఎంతో అసభ్యంగా నన్ను నా ఇమేజ్‌ను డామేజ్ చేయడం, ఇలాంటి ఎన్నో సంఘటనల ఆధారంగానే నాకు ఒపినియన్ ఏర్పడింది. నా ఒపినియన్‌ను గౌరవిస్తారని కోరుకొంటున్నాను. అన్ని రకాల సినిమాలను ఒకే రకంగా గౌరవిస్తారని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను అని వెంకటేష్ మహా అన్నారు.

నీచ్ కమీన్ కుత్తే అంటూ తిట్టడమంటే

నీచ్ కమీన్ కుత్తే అంటూ తిట్టడమంటే

అయితే తాను చేసిన వాదన తప్పు కాదు.. తాను వాడిన భాష తప్పు అంటూ వెంకటేష్ మహా సమర్ధించుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు ఘాటుగా వ్యతిరేకిస్తున్నారు. ఒక పాత్రను దర్శకుడు సృష్టిస్తే.. ఆ పాత్రను అవహేళన చేస్తూ దూషించడం సరైనదేనా. ఒక డైరెక్టర్ సృష్టించిన పాత్రను నీచ్ కమీన్ కుత్తే అంటూ తిట్టడమంటే.. ఆ దర్శకుడిని దూషించడమే. ఇంకా నీకు పరిస్థితి అర్ధం కావడం లేదు. నీవు కరెక్ట్ అనుకోవడం సరికాదు. ఇంకా నీకు కొవ్వు తగ్గలేదు అంటూ వెంకటేష్ మహాను ట్రోల్ చేస్తున్నారు.

కేజీఎఫ్ తీసిన వ్యక్తికి అవగాహన ఉంది అంటూ

కేరాఫ్ కంచరపాలెం అనే అద్బుతమైన సినిమాను తీశావు. నీవు మంచి సినిమా తీసి మంచి పనిచేశావు. కానీ ఫిల్మ్ మేకింగ్‌లో నిన్ను సూపీరియర్‌గా చేయలేదు. ఒకరు తీసిన సినిమాపై మీకు అవగాహన లేకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి తీసే సినిమాపై ఆయనకు పూర్తిగా క్లారిటీ ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X