twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్, మహేష్ కొడుకు స్టేడియంలో ఇలా... (ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : వెంకటేష్, మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ..ఇద్దరూ కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో..నిన్న ఇలా కనిపించారు. అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ముంబై ఇండియన్స్ కు జరిగిన లైవ్ మ్యాచ్ తిలకించటానికి వచ్చారు. ఇద్దరూ కూడా ఫుల్ గా మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. వెంకటేష్ కుమారుడు అర్జున్ దగ్గుపాటి కూడా ఈ మ్యాచ్ కు వచ్చారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    వెంకటేష్ చిత్రాల విషయానికి వస్తే..

    వెంకటేష్, రానా కాంబినేషన్లో సినిమా చేయాలని రామానాయుడు ఎప్పుడో ఆలోచన చేసారు కానీ దాన్ని ఆచరణలోకి తేక ముందే ఆయన కాలం చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తనయుడు, నిర్మాత సురేష్ బాబు వెంకీ, రానా కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

    ఈ విషయమై రానా గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.....బాబాయ్ వెంకటేష్ తో కలిసి త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. సరైన స్క్రిప్టు దొరికితో రానాతో కలిసి చేయడానికి సిద్దమే అని వెంకటేష్ కూడా గతంలో ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్క్రిప్టు ఓకే అయినట్లు తెలుస్తోంది.

    Venkatesh & Mahesh Babu's Son at the Stadium!

    బాబాయ్-అబ్బాయ్ బాడీ లాంగ్వేజ్.... వాళ్ల వాళ్ల స్టార్ ఇమేజ్‍‌కు తగిన విధంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. స్క్రిప్టు పూర్తి స్థాయిలో డెవలప్ అయిన తర్వాత సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. వీరి సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ లోనే చిత్రం నిర్మాణమయ్యే అవకాశం ఉంది.

    అలాగే...
    పవన్ కళ్యాణ్ తో చేసిన 'గోపాల గోపాల' తరవాత వెంకటేష్‌ మరో కథకు పచ్చజెండా వూపలేదు. కొన్నాళ్లు ఆయన విశ్రాంతి తీసుకొన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త కథలు వింటున్నారు. అందులో భాగంగా రవిబాబు చెప్పిన కథని వెంకీ ఓకే చేశాడని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థకీ, రవిబాబుకీ మంచి అనుబంధం ఉంది.

    రవిబాబు తాజా చిత్రం 'అవును 2' కూడా సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చినదే. ఇప్పుడు వెంకీతో చిత్రాన్ని కూడా ఆ సంస్థే తెరకెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ''త్వరలోనే ఓ స్టార్ హీరో తో ఓ యాక్షన్‌ చిత్రం చేయబోతున్నా'' అంటూ రవిబాబు కూడా హింట్‌ ఇచ్చేశారు. మరి ఈ కలయికలో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. అయితే వెంకటేష్ వంటి ఫ్యామిలీ హీరోని..రవిబాబు వంటి మోడ్రన్ ఐడియాలజీతో ఉన్న దర్శకుడు ఎలా డీల్ చేస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది.

    నటుడిగా సినీ రంగానికి పరిచయమైనా... దర్శకుడిగా తనకంటూ ఓ శైలి సృష్టించుకొన్నారు రవిబాబు. 'అల్లరి', 'అనసూయ', 'నచ్చావులే', 'నువ్విలా' చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొన్నారు. హారర్‌, థ్రిల్లర్‌ చిత్రాల్ని తెరకెక్కించడంలోనూ సిద్ధహస్తుడు అనిపించుకొన్నారు. ఇప్పుడు 'అవును 2'తో మరోసారి భయపెడతానంటూ.... ఈ నెల 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అనుకున్న స్ధాయిలో వర్కవుట్ కాలేదు.

    అయితే రవిబాబు తో చాలా సుఖం ఉందని నిర్మాతలు అంటారు. ఆయన అనుకున్న బడ్జెట్ లోనే చెప్పినట్లు తీసి ఇవ్వగల టెక్నీషియన్. ''స్క్రిప్టు దశలోనే జాగ్రత్తపడితే బడ్జెట్‌ ఎప్పుడూ నియంత్రణలోనే ఉంటుంది. నేనెప్పుడూ ఒక్క షాట్‌ కూడా వృథాగా తీయను. అందుకే నా సినిమాలన్నీ అనుకొన్న వ్యయంలోనే పూర్తవుతాయి'' అంటారు రవిబాబు.

    English summary
    Venkatesh and Mahesh Babu's Son Gautham Krishna came all the way to Uppal Stadium Yesterday to catch the live action of last league match between Sun Risers Hyderabad and Mumbai Indians match.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X