తమిళంలో కమల్,తెలుగులో వెంకటేష్ ఖరారు

తెలుగు వెర్షన్ ని సురేష్ ప్రొడక్షన్స్,వైడ్ యాంగిల్ ఫిల్మ్స్ వారు కలిసి నిర్మిస్తారు. శ్రీప్రియ దర్శకత్వంలో చిత్రం రూపొందనుంది. హీరోయిన్ మిగతా విషయాలు తేలాల్సి ఉంది. ఇక తమిళ వెర్షన్ లో మీనా నే హీరోయిన్ గా తీసుకోనున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మీనా దశ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది .
గతంలో 'భామనే సత్యభామనే' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి మనకు తెలిసిందే. అలాంటి ఈ జంటను ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మలయాళం వెర్షన్లో చక్కని అభినయాన్ని ప్రదర్శించిన మీనానే తమిళంలో కూడా తీసుకోవాలని కమల్ భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications