వెంకటేష్ ఆడవారి ... ఈ నెలాఖరులో
వెంకటేష్ ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే సినిమా ఎప్పుడో ప్రారంభం కావలసి ఉంది. ఈ సంవత్సరం వెంకటేష్ సినిమా లక్ష్మి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుంది. ఈ సినిమా ఫిబ్రవరిలోనే లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ రెగ్యులర్ షూటింగ్ ఆలస్యమైంది. లక్ష్మి సినిమా తర్వాత వెంకటేష్ ఏ సినిమాలోనూ నటించలేదు. ఆయన ఇటీవల కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళి నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకుని వచ్చారు. సెల్వరాజన్ సినిమా తర్వాత వెంకటేష్ త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించే అవకాశ ముంది.


Click it and Unblock the Notifications