twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ, చైతన్య మూవీపై రూమర్లు.. ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేదని వివరణ!

    |

    Recommended Video

    Venkatesh And Naga Chaitanya’s Movie Starts In November

    విక్ట‌రీ వెంక‌టేష్, యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రానికి టైటిల్ వెంకీ మామ అని తెలిసిన‌ప్ప‌టి నుంచి అటు వెంకీ అభిమానులు ఇటు నాగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ కి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    వెంకీ మామ సినిమా ఆగిపోయిందని

    వెంకీ మామ సినిమా ఆగిపోయిందని

    అయితే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది కానీ...ఇంకా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాక‌పోవ‌డంతో వెంకీ మామ ఆగిపోయింది అనే ప్ర‌చారం మొద‌లైంది. అస‌లు విష‌యం ఏంటంటే...వెంక‌టేష్ ప్ర‌స్తుతం ఎఫ్ 2 సినిమాలో బిజీగా ఉన్నారు. దాంతో సినిమా షూట్ మొదలు కాలేదు.

    సవ్యసాచితో చైతూ బిజీగా

    సవ్యసాచితో చైతూ బిజీగా

    అలాగే నాగ‌చైత‌న్య ఓ వైపు స‌వ్య‌సాచి ప్ర‌మోష‌న్స్, మ‌రో వైపు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న వెంకీ మామ సెట్స్‌పైకి వెళ్లడానికి సమయం పడుతున్నది. దాంతో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది.

    నవంబర్ రెండో వారంలో

    నవంబర్ రెండో వారంలో

    తాజా స‌మాచారం ప్ర‌కారం... న‌వంబ‌ర్ రెండోవారం నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. నాగ చైత‌న్య న‌వంబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడ‌ని తెలిసింది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమా అక్కినేని, ద‌గ్గుబాటి అభిమానుల‌కు ఓ పండ‌గ అని చెప్ప‌చ్చు.

     హ్యూమా, రకుల్ ప్రీత్ సింగ్

    హ్యూమా, రకుల్ ప్రీత్ సింగ్

    వెంకీ, నాగచైతన్య నటించే ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తారనే ప్రచారం జరుగుతున్నది. వెంకటేష్ సరసన హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడిగా రకుల్ ఉంటారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే హీరోయిన్ల ఎంపిక అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

    English summary
    Venkatesh and Naga Chaitanya’s forthcoming film to be directed by KS Ravindra (Bobby). The film is being produced by Suresh Babu in association with Kona Venkat. However, rumours are now rife that the film has been shelved. But film unit says that this film shoot will go onto sets in november second week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X