Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంకీ, చైతన్య మూవీపై రూమర్లు.. ఆ వార్తల్లో వాస్తవం లేదని వివరణ!
Recommended Video
విక్టరీ వెంకటేష్, యువ సమ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్రానికి టైటిల్ వెంకీ మామ అని తెలిసినప్పటి నుంచి అటు వెంకీ అభిమానులు ఇటు నాగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ కి జై లవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
వెంకీ మామ సినిమా ఆగిపోయిందని
అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది కానీ...ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో వెంకీ మామ ఆగిపోయింది అనే ప్రచారం మొదలైంది. అసలు విషయం ఏంటంటే...వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్ 2 సినిమాలో బిజీగా ఉన్నారు. దాంతో సినిమా షూట్ మొదలు కాలేదు.
సవ్యసాచితో చైతూ బిజీగా
అలాగే నాగచైతన్య ఓ వైపు సవ్యసాచి ప్రమోషన్స్, మరో వైపు శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వలన వెంకీ మామ సెట్స్‌పైకి వెళ్లడానికి సమయం పడుతున్నది. దాంతో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది.
నవంబర్ రెండో వారంలో
తాజా సమాచారం ప్రకారం... నవంబర్ రెండోవారం నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. నాగ చైతన్య నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలిసింది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందే ఈ సినిమా అక్కినేని, దగ్గుబాటి అభిమానులకు ఓ పండగ అని చెప్పచ్చు.
హ్యూమా, రకుల్ ప్రీత్ సింగ్
వెంకీ, నాగచైతన్య నటించే ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తారనే ప్రచారం జరుగుతున్నది. వెంకటేష్ సరసన హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడిగా రకుల్ ఉంటారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే హీరోయిన్ల ఎంపిక అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.