వెంకటేష్-నాగ చైతన్య మల్టీ స్టారర్ షురూ... తెరపై తడాఖా చూపబోతున్న మామ అల్లుడు!

By Bojja Kumar

టాలీవుడ్లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమలో మరో మల్టీస్టారర్ బుధవారం ప్రారంభోత్సవంజరుపుకుంది. వెంకటేష్-నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ(కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించబోతున్న మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివి వినాయక్, రానా దగ్గుబాటి, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రంలో ఇద్దరు లీడ్ హీరోయిన్లు ఉండబోతున్నారు. చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఫైనల్ అవ్వగా.... వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ ఎంపిక జరుగాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇతర తారాగణం వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ తెలిపారు.

Venkatesh, Naga Chaitanya multi-starrer launch

వెంకటేష్ ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్‌తో కలిసి 'ఎఫ్ 2' అనే మరో మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మరో వైపు నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సవ్యసాచి' చిత్రం విడుదలకు సిద్ధమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X