»   » మరోసారి మామా-అల్లుడుగా అదరగొట్టబోతున్న వెంకటేష్-నాగ చైతన్య

మరోసారి మామా-అల్లుడుగా అదరగొట్టబోతున్న వెంకటేష్-నాగ చైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

రియల్ లైఫ్‌లో మామ-అల్లుడు అయిన వెంకటేష్-నాగ చైతన్య ఆ మధ్య వచ్చిన 'ప్రేమమ్' చిత్రంలో మామా, అల్లుడుగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకీ డీసీపీ రామచంద్రం పాత్రలో అతిథిగా మెరిసారు వెంకీ. మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారట. ఈ సారి ఇద్దరూ ఫుల్ లెంగ్త్ మామా-అల్లుడుగా తెరపై సందడి చేయబోతున్నారట.

Venkatesh and Naga Chaitanya to worked together again

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ చిత్రాలకు దర్శకత్వం వహించిన కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందని, ఈ చిత్రంలో ఇద్దరూ పూర్తి నిడివి ఉన్న మామా-అల్లుడు పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభం కానుందట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం వెంకటేష్ తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేటా నాదే' అనే సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Film Nagar source said that, Venkatesh Daggubati and Akkineni Naga Chaitanya sharing the screen space in an upcoming film once again, which will be helmed by Sardaar Gabbar Singh and Jai Lava Kusa’s helmer KS Ravindra alias Bobby. The sources close to the film unit reveal that both Venky and Chaitu are playing full length Mama- Alludu in this film. The movie will go on the floors in August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X