వెంకటేష్ 'నాగవల్లి' విడుదల వాయిదా...ఆ వివాదంతోనే
ఈ గురువారం (డిసెంబర్ 16) విడుదల కానున్న వెంకటేష్ తాజా చిత్రం "నాగవల్లి" వాయిదా పడే అవకాశం ఉంది. గత నాలుగు రోజులుగా నిర్మాతలు అంతా షూటింగ్ లు ఆపుచేసి చేస్తున్న స్ట్రైక్ కు మద్దతుగా ఈ పోస్ట్ వేన్ వేస్తానని నిర్మాత బెల్లంకొండ సురేష్..నిర్మాతల మండిలికి లెటర్ ఇచ్చారు. అయితే ఫైనల్ డెషిసన్ రేపు (మంగళవారం) తేలనుంది. ఇక బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న కందిరీగ చిత్రం షూటింగ్ లోనే ఈ వివాదం మొదలైంది. నిబంధనలకు విరుద్దంగా స్ధానికేతరులకే సినిమాలో ఎక్కువ ప్రాముఖ్యత కల్పించారని ఆరోపిస్తూ స్ధానికంగా ఉన్న పలువురు సినీ ఫైటర్లు చెన్నై ఫైట్ మాస్టర్లపై దాడి చేయటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ ఘటనను నిరసిస్తూ తెలుగు సినిమా షూటింగ్ లన్నీ రద్దు చేస్తున్నట్లు సినిమా నిర్మాతల మండలి ప్రకటించింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఛార్మినార్ వద్ద చిత్రీకరిస్తున్న కందిరీగ సినిమా షూటింగ్ లో చెన్నై, ఆంధ్రా ఫైటర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక తన చిత్రంతోనే వివాదం మొదలైంది కాబట్టి తన మరో చిత్రం కూడా విడుదల చేయటం నైతికంగా పద్దతి కాదనే ఆలోచనతో వచ్చి బెల్లంకొండ ఈ వాయిదా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











