వెంకటేష్ 'నాగవల్లి..ది రిటన్ ఆఫ్ చంద్రముఖి' ఫస్ట్ లుక్ ఫోస్టర్ సూపర్
వెంకటేష్ తాజా చిత్రం..నాగవల్లి..ది రిటన్ ఆఫ్ చంద్రముఖిని టీజర్ ని విడుదల చేసారు. అందులో వెంకటేష్ గానీ మరే తారాగణం లేకుండా కేవలం చంద్రముఖి ఫొటోని పెట్టి ఈ పోస్టర్ ని వేసారు. ఈ సీక్వెల్ ప్రారంభంలోనే చంద్రముఖి ఫొటోని ఒక పాపకు గిప్ట్ గా ఇవ్వటంతో కథ ప్రారంభమవుతుంది. హర్రర్ జనర్ గా రూపొందే ఈ చిత్రంలో వెంకటేష్..ముసలి గెటప్ లోనూ కనపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అలాగే త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ చిత్రం డిసెంబర్ మూడవ తేదీ నుండి ప్రారంభం కానుంది ఈ కాంబినేషన్ లో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, వాసు చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. అయితే అప్పుడు రైటర్ గా త్రివిక్రమ్ ఆ చిత్రాలకు పనిచేసారు. ఈ చిత్రం యూనవర్శిల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తారు. మరో ప్రక్క వెంకటేష్..మళయాళ చిత్రం బాడీగార్డ్ రీమేక్ కు కూడా కమిటయ్యారు.
వెంకటేష్ త్రివిక్రమ్ డివివి దానయ్య చంద్రముఖి ఖలేజా మల్లీశ్వరి venkatesh trivikram chandramuki khaleja dvv danayya


Click it and Unblock the Notifications