Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వెంకీ నమో వెంకటేశ రిలీజ్ డేట్
వెంకటేష్, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నమో వెంకటేశ చిత్రం జనవరి 14న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి స్ధాయి రొమాంటిక్ ఎంటర్టైర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యూరప్ లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే నమో వెంకటేశ చిత్రంలో వెంకటేష్..వెంట్రాలక్విస్ట్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఓ బొమ్మను పట్టుకుని అందరినీ వినోదపరిచే ఈ పాత్ర బాగా వర్కవుట్ అవుతుందని అంటున్నారు.అందుకోసం వెంకటేష్ ప్రత్యేకమైన ట్రైనింగ్ ని సైతం పొందినట్లు తెలుస్తోంది. ఇక తన గొంతులో రకరకాల పాత్రలు వినిపించే ఈ తరహా పాత్రను గతంలో కమల్ హాసన్ ఇది కథ కాదు చిత్రంలో చేసారు.అందులోని అటు ఇటు కాని హృదయం తోటి..ఎందుకురా ఈ తొందరనీకు అనే పాట చాలా పాపులర్. అటువంటి సెంటిమెంట్ టచ్ నే ఈ చిత్రంలో వెంకీ క్యారెక్టర్ పండించనున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీను వైట్ల సినిమాలో రెగ్యులర్ గా కనిపించే బ్రహ్మానందం పాత్ర హైలెట్ అంటున్నారు. పూర్తి స్ధాయి ఫన్ తో నడిచే ఈ చిత్రం వెంకటేష్ అభమానులను అలరిస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఆచంట గోపీనాధ్ తో కలసి సుంకర అనీల్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆచంట గోపీనాధ్ గతంలో టాప్ హీరో, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ వంటి వినోదాత్మక చిత్రాలు నిర్మించారు. అలాగే ఆపర్చునేట్ ఛానెల్ (A) పెట్టిన అనీల్ సుంకర వరసగా సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.