ఏడాది తరువాత థియేటర్లో వెంకటేష్ సినిమా.. ఈసారైనా హిట్ అందుతుందా?
దగ్గుబాటి వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద సోలోగా సక్సెస్ అందుకొని చాలా కాలం అవుతోంది. అలాగే సోలోగా ఆయన సినిమా థియేటర్ లోకి వచ్చి కూడా చాలా కాలమవుతోంది. గత రెండేళ్ల నుంచి వెంకటేష్ సినిమాలు ఎక్కువగా ఓటీటీ లోనే విడుదలవుతున్నాయి. వెంకీ సోలోగా 2017లో గురు అనే సినిమాతో వచ్చాడు. ఆ తరువాత F2, వెంకీ మామ మల్టీస్టారర్ సినిమాలు థియేట్రికల్ గా విడుదలయ్యాయి. కమర్షియల్ గా మల్టీస్టారర్ సినిమాలతో వెంకీ సక్సెస్ అందుకున్నాడు.
దృశ్యం, నారప్ప రెండు రీమేక్ సినిమాలు ఆ తరువాత ఓటీటీ లోనే విడిదలయ్యాయి. ఇక ఆ తరువాత F3 సినిమా థియేటర్లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఓరి దేవుడా సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వెంకటేష్ నటించిన ఒక సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఆ సినిమా మరేదో కాదు. తమిళ రీమేక్ మూవీ నారప్ప. తెలుగులో ఈ సినిమా 2021 జూన్ 20 అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది. ఇక ఆ తరువాత ఆ సినిమాను మళ్ళీ థియేట్రికల్ గా విడుదల చేయాలని అనుకున్నప్పటికి సాధ్య పడలేది.

ఇక ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి నారప్ప సినిమాను మొదటిసారి బిగ్ స్క్రీన్ పై ప్రదర్శిస్తే ఆడియెన్స్ చూస్తారని నమ్మకంతో ఉన్నారు. అందుకే డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నారప్ప సినిమాను థియేట్రికల్ గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక ప్రియమణి కథానాయికగా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఓటీటీ లో అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. థియేట్రికల్ గా అయితే సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా కేవలం 13వ తేదీ మాత్రమే లిమిటెడ్ థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. రెస్పాన్స్ ను బట్టి మరొక రోజు కూడా షోలు వేసే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











