Narappa twitter review: ఆ ఒక్క విషయంలో అప్సెట్ అవుతున్న ఫ్యాన్స్.. హైలెట్ క్యారెక్టర్ అదే!

కోలీవుడ్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా వచ్చిన నారప్ప ఆమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. వెంకటేష్ ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశాడు. ఇక గత రాత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందా అని ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ఇక సినిమాను చూస్తున్న ప్రేక్షకులు సోషల్ మీడియాలో వారి అనుభవాలను పంచుకుంటున్నారు. ట్విట్టర్ ద్వారా సినిమా రిజల్ట్ పై కామెంట్ చేస్తున్నారు.

నెటిజన్స్ రెస్పాన్స్..

నెటిజన్స్ రెస్పాన్స్..

థియేట్రికల్ గా విడుదల కావాల్సి నారప్ప చివరి నిమిషంలో ఓటీటీ డీల్ కు తలొగ్గక తప్పలేదు. ఇక సినిమాకు వస్తున్న రివ్యూలు అయితే మిక్స్ డ్ గా ఉన్నాయి. నెటిజన్ల నుంచి కూడా అదే తరహాలో కామేంట్స్ వస్తున్నాయి. తమిళ్ అసురన్ సినిమాను చూసిన వారు తెలుగు నారప్పను పెద్దగా లైక్ చేయడం లేదు.

అసురన్ తో పోలిస్తే..

అసురన్ తో పోలిస్తే..

అసురన్ సినిమా తెలుగులో రీమేక్ అవుతోంది అనగానే తమిళ్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇంత మంచి పాయింట్ ను ఎలా ప్రజెంట్ చేస్తారని అనుకున్నారు. ఇక అసురన్ తో పోలిస్తే తమిళ జనాలని ఈ సినిమా అప్సెట్ చేసిందని కామెంట్స్ వస్తున్నాయి. ధనుష్ యాక్టింగ్ మాత్రమే గొప్పగా ఉందని అంటున్నారు.

యాక్టింగ్ తో పోల్చడం సరికాదని

యాక్టింగ్ తో పోల్చడం సరికాదని

ఇక తమిళ్ లో ఓ వర్గం ప్రేక్షకులు వెంకటేష్ ను ట్రోల్ చేస్తుండగా మనోళ్లు ధనుష్ ను ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అసలైన వెంకీ అభిమానులు ఈ విషయంలో అప్సెట్ అవుతున్నారు. కొంతమంది ప్రముఖులు యాక్టింగ్ తో పోల్చడం సరికాదని రెండు సినిమాలను పోల్చకుండా చూస్తేనే బెటర్ అని అంటున్నారు.

వేరే లెవెల్లో ఉంటుందని..

వేరే లెవెల్లో ఉంటుందని..

నారప్ప ఒరిజినల్ కు ఏ మాత్రం తగ్గకుండా తీశారు. వెంకటేష్ మాస్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో బెస్ట్ అనిపించుకున్నాడు. కానీ అసురన్ కు నారప్ప కు పోల్చి చూస్తే అసురన్ లో ధనుష్ యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

చూడప్ప నారప్ప..

చూడప్ప నారప్ప..

ఇక వెంకటేష్ పెద్దగా నెగెటివ్ ఫ్యాన్స్ ఉండరని అందరికి తెలిసిందే. కానీ రీమేక్ చేసిన అనంతరం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వర్గం వారు సినిమాను ట్రోల్ చేస్తున్నారు. చూడప్ప నారప్ప.. నువ్వు అసురన్ లాంటోడివప్ప.. అది తమిళ్, నువ్వు తెలుగు.. అంతే తేడా.. మిగిలిందంతా సేమ్ టూ సేమ్.. అని పవన్ కళ్యాణ్ డైలాగ్ తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

హైలెట్ క్యేరెక్టర్

హైలెట్ క్యేరెక్టర్

ఇక సినిమాలో వెంకటేష్ యాక్టింగ్ కు ఎక్కువగనే ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఆ తరువాత సినిమాలో కార్తిక్ రత్నం పాత్ర ఎక్కువగా హైలెట్ అవుతోంది. వెంకటేష్ తనయుడిగా అతని నటన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక సినిమాలో హైలెట్ క్యేరెక్టర్ ఇదేనని నెటిజన్లు రివ్యూలో స్పెషల్ గా మాట్లాడుతున్నారు.

అలా ఉండకపోతే.. టైటానిక్ లా ఉంటుందా?

అలా ఉండకపోతే.. టైటానిక్ లా ఉంటుందా?

ఫైనల్ గా అసురన్ సినిమా చూసిన వారికి నారప్ప గురించి రివ్యూ ఇవ్వకపోతేనే బెటర్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 'అలాగే ఉంది అని అంటున్నారు. రీమేక్ సినిమా అలా ఉండకపోతే టైటానిక్ లా ఉంటుందా.. నారప్ప నచ్చిందా లేదా ఆన్స్ విషయాన్ని మాత్రమే చెప్పండి' అని వెంకీ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. అంతే కాకుండా సినిమాను ఎలాంటి ఆలోచనలు లేకుండా ఫ్రెష్ గా చూస్తే చాలా నచ్చితుందని కూడా చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X