సంక్రాంతికి మళ్ళీ వెంకీ, నయనతార సిన్మా
వచ్చే సంక్రాంతికి వెంకటేష్, నయనతారల సినిమా విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి సురేష్‌బాబు భద్ర ఫేం బోయపాటి శీను దర్శకత్వంలో వెంకటేష్‌తో సినిమా నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్ వీడిపోయింది. నయనతార కథానాయిక. వెంకటేష్-నయనతార నటించిన లక్ష్మి చిత్రం గత సంక్రాంతి సీజన్‌లో సూపర్‌హిట్ అయింది. ఈ సినిమా ఆగస్టు- సెప్టెంబర్ నెలల్లో లాంఛనంగా ప్రారంభమవుతుంది. అనేక పెద్ద సినిమాలు వస్తున్న సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో త్రిష తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ నయనతార. చిరంజీవి స్టాలిన్ సినిమాలో ఐటం సాంగ్ చేయడానికి నయనతార అంగీకరించకపోవడంతో కత్రినా కైఫ్‌ను రంగంలోకి దించవలసి వచ్చింది.


Click it and Unblock the Notifications