గ్యాంగ్ వార్ నేపథ్యంలో ‘గంగ’?
'రణం" చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను ప్రకటించుకున్న 'అమ్మ"రాజశేఖర్ తాజాగా వెంకటేష్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి హవేలి (పెద్ద భవంతి) సెట్‌ను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ చివరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం 'గ్యాంగ్‌వార్" నేపధ్యంలో రూపొందనుందని, 'గంగ" అనే పేరు ఈ చిత్రానికి పరిశీలనలో ఉందని అనధికారవర్గాల సమాచారం.
యాక్షన్ నేపధ్యంలో వెంకటేష్ తో రూపొందిన 'లక్ష్మీ", 'తులసి" చిత్రాలు ఘన విజయం సాధించడంతో..'గంగ" అనే టైటిల్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌ని కూడా ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'నమో వెంకటేశా" చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న వెంకటేష్, సెప్టెంబర్ చివరి నుంచి ఈ చిత్రం షూటింగ్ లోనూ పాల్గొంటారు.


Click it and Unblock the Notifications











