వెంకీ, మహేష్ సినిమా దసరా రోజే పూజ
వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రం ఖరారు అయ్యిన సంగతి తెలిసిందే. కొత్త బంగారులోకం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం దసరా రోజు పూజ చేసి లాంఛనంగా ప్రారంభిస్తారు. నవంబర్ లో షూటింగ్ మొదలవుతుంది. వెంకటేష్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ నవంబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటారు. మహేష్ మాత్రం జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళతారు. ఇక ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ ఇద్దరూ అన్నదమ్ములుగా కనిపించనున్నారని చెప్పుకున్నారు. ప్రస్తుతం మహేష్ దూకుడు విజయోత్సాహంలో ఉన్నారు. పూరీతో చేస్తున్న ది బిజినెస్ మ్యాన్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వెంకటేష్ విషయానికి వస్తే ఆయన గంగ.. ది బాడీగార్డ్ చిత్రం విడుదల కోసం చూస్తున్నారు. మళయాళ చిత్రం ది బాడీ గార్డ్ కి రీమేక్ వెర్షన్ ఇది. డాన్ శీను డైరక్టర్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఇక నిర్మాత దిల్ రాజు.. తన తాజా చిత్రం ఓ మై ప్రెండ్ ఫినిషింగ్ టచెస్ లో ఉన్నారు. సిద్దార్ధ, హన్సిక, శృతిహాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











