వెంకటేష్ ‘షాడో’ఓపినింగ్ విశేషాలు
యునెటైడ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్, శ్రీకాంత్ కాంబినేషన్‌లో సింహా నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న 'షాడో' చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. 'సంక్రాంతి' చిత్రం తర్వాత మరోసారి వెంకటేశ్, శ్రీకాంత్ కలిసి నటిస్తున్న చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాప్సీ, మధురిమ హీరోయిన్స్ గా చేస్తున్న చిత్రం ఓపినింగ్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. హీరో, హీరోయిన్లపై తీసిన ముహూర్తపు దృశ్యానికి డా.డి.రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు.
అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ -''ఇది కమర్షియల్ ఎంటర్‌టైనర్. నా కెరీర్‌లో గుర్తించుకోదగ్గ మరో పెద్ద కమర్షియల్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. శ్రీకాంత్ కూడా చాలా మంచి పాత్ర పోషిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాము. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ...వెంకటేష్‌తో కలిసి పనిచేసే అవకాశం రావటం ఆనందంగా ఉంది. యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉన్న కథ ఇది. అలాగే వినోదాన్నీ మేళవించాం. సిడ్నీ, మెల్‌బోర్న్‌ల్లో ముఖ్య సన్నివేశాలు చిత్రిస్తామని అన్నారు. మాటల రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ....కేవలం పది రోజుల్లోనే ఈ కథను తయారు చేశాము. టైటిల్, వెంకటేష్ లుక్ చూసి బాలీవుడ్ సినిమాలా ఉన్నా పక్కా తెలుగు సినిమా. పరుచూరి కిరీటి ఎంతో భారీగా నిర్మించే ఈ మల్టీస్టారర్ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ తరహాలోనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపు దిద్దుకోనుంది. వెంకటేష్, శ్రీకాంత్ పాత్రలతో పాటు తాప్సీ పాత్ర చాలా ఎనర్జీగా ఉంటుంది'అన్నారు. తాప్సీ మాట్లాడుతూ....వెంకటేష్, శ్రీకాంత్ లాంటి పెద్ద స్టార్స్‌తో పనిచేయనుండడం చాలా సంతోషంగా ఉంది. మిస్టర్ పర్‌ఫెక్ట్ తర్వాత మరోమారు ఆస్ట్రేలియా వెళ్లనుండడవ హ్యాపీగా ఉందన్నారు.
సంగీత దర్శకుడు యస్.యస్.తమన్ మాట్లాడుతూ...వెంకటేష్ గారితో 'బాడీగార్డ్' తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఇక మెహర్ రమేష్ గారితో' అమ్మా నాన్న తమిళమ్మాయి' నుండి పరిచయం. మంచి సంగీతం అందించడానికి కృషి చేస్తాను' అన్నారు.


Click it and Unblock the Notifications











