ఎవరినీ పిలవకుండా కొత్త ఇంట్లోకి మారిన వెంకటేష్

By Srikanya

స్టార్ హీరో వెంకటేశ్ రీసెంట్ గా కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు. హైదరాబాద్ లోని మణికొండ దగ్గర్లోని ఉప్పాల్ గూడలో ఒక భారీ ఇంటిని నిర్మించి ఆయన ఈ మధ్యనే తన కుటుంబ సభ్యులతో కలిసి.. గృహప్రవేశం చేశారు. తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా చేయించారు. ఈ కార్యక్రమానికి కొద్దిమందినే పిలిచారు. ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని.. అయ్యాక సినీ పరిశ్రమ నుంచి అందరినీ పిలిచి భారీ ఎత్తున విందును ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు.

అలాగే ఈ ఇల్లు నాలుగు ఎకరాల్లో కట్టారని,బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఇల్లు తరహాలో ఉంటుందని తెలుస్తోంది.ఈ ఇంటిలో వాకింగ్,మెడిటేషన్ వంటి వాటికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు. ఇక వెంకటేష్ ప్రస్తుతం బాడీగార్డ్ రీమేక్ లో నటిస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్టయిన ఆ చిత్రాన్ని డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. త్రిష ఈ చిత్రంలో వెంకటేష్ సరసన చేస్తోంది. సెంటిమెంట్ తో కూడిన ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X