వెంకీ అరిపించాడుగా, సుందరకాండ తరువాత..లుక్ అదిరిపోయింది!
Recommended Video

వెంకటేష్ నటిస్తున్న తాజాగా చిత్రం 'ఆట నాదే వేట నాదే'. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రం దర్శకుడు తేజని పరాజయాల బాట నుంచి గట్టెక్కించింది. ఈ చిత్ర విజయం తరువాత తేజ వెంకీకి కథ చెప్పడం, వెంకీ ఓకే చేయడం జరిగిపోయాయి. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానాని తేజ రాజకీయ నాయకుడిగా ప్రజెంట్ చేసాడు. లేటెస్ట్ గా తేజ తెరకెక్కించబోయే చిత్రంలో వెంకి లుక్ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వెంకి సరికొత్త లుక్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో వెంకీ పాత్ర గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సత్తా
దర్శకుడు తేజ చాలా కాలం పాటు పరాజయాలతో సతమతం అయ్యాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తేజ మంచి పొలిటికల్ సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తేజలో మళ్ళీ ఉత్సాహం నెలకొంది.

వెంట వెంటనే రెండు క్రేజీ చిత్రాలు
నేనే రాజు నేనే మంత్రి చిత్రం అందించిన విజయంతో తేజకు మళ్ళీ అవకాశాలు వెల్లువెత్తాయి. తేజ రెండు క్రేజీ చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారు.

వెంకీ సినిమాతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ కూడా
ప్రస్తుతం తేజ చేతిలో వెంకటేష్ చిత్రంతో పాటు, బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి కూడా తేజనే దర్శకుడు.

వైరల్ గా మారిన వెంకీ సినిమా లుక్
తేజ, వెంకీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్ర లుక్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భుజాన బ్యాగు, చేతిలో పుస్తకాలు, స్టైలిష్ గడ్డం లుక్ లో వెంకీ అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాడు. చూడగానే నచ్చేసే విధంగా ఈ లుక్ లో వెంకీ ఉన్నాడు.

సుందరకాండ తరువాత
వెంకటేష్ ఈ చిత్రంలో వెంకటేష్ ప్రొఫెసర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుందరకాండ చిత్రంలో వెంకీ ఉపాధ్యాయుడుగా నటించిన మెప్పించిన సంగతి తెలిసిందే.

రెగ్యులర్ షూటింగ్
వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. శ్రీయ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











