వెంకటేష్ 'జయకృష్ణా ముకుందా మురారీ'
గమ్యం సినిమాతో ఒక్కసారిగా పరిశ్రమను తన వైపుకుతిప్పుకున్న ప్రతిభాశీలి రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్ర్. అలాగే తనదైన శైలిలో రొమాంటిక్ కామెడీలుతో ప్యామిలీలను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న సీనియర్ టాప్ హీరో వెంకటేష్. వీరిద్దరి కలయికతో సినిమా అనే వార్త వచ్చింది. దాన్ని నిజం చేస్తూ వెంకటేష్ .....క్రిష్ర్ డైరెక్షన్‌లో నటించేందుకు మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాను వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు 'జయకృష్ణా ముకుందా మురారీ" అనే టైటిల్ పరిశీలనలో వుంది. వెంకటేష్ ప్రస్తుతం 'చింతకాయల రవి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్"గా నటిస్తున్నారు. యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లు.
గమ్యం మాదిరిగానే చక్కని ఎంటర్‌టైనర్‌గా వుంటూనే, కొంత ఫిలాసఫీ తో కథ సిద్దం చేప్పారని తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధమైన ఈ సినిమా స్క్రిప్టుకు క్రిష్ తన రచయిత గంధం నాగరాజు తో కలిసి మరింత మెరుగులు దిద్దుతున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ ఇంతదాకా కనుపించని వైవిధ్యమైన పాత్రలో చూపించాలని ప్రయత్నంట. అలాగే ఆయన సరసన హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేయాలని క్రిష్ భావిస్తున్నాడు. అంటే మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెలుగు తెరను పలకరించబోతోందన్నమాట.


Click it and Unblock the Notifications











