ఖరారు: వెంకటేష్ కొత్త చిత్రం డైరక్టర్, నిర్మాత, హీరోయిన్
హైదరాబాద్ : దృశ్యం తర్వాత వెంకటేష్ మరో చిత్రం కమిటయ్యారు. ఆయన తన ఇమేజ్ మార్చుకునే ప్రాసెస్ లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన ఓ కొత్తచిత్రం కమిటయ్యారు. సింహా చిత్రం బాలకృష్ణతో, షాడో చిత్రాన్ని వెంకటేష్ తో నిర్మించిన పరుచూరి ప్రసాద్ నిర్మాత మరి దర్శకుడు హీరోయిన్ ఎవరూ అంటే...
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
వెంకటేష్ హీరో యునైటెడ్ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. పరుచూరి ప్రసాద్ నిర్మాత. 'ఓనమాలు', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'తో ఆకట్టుకొన్న క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తారు. ఇటీవల క్రాంతిమాధవ్ కథ చెప్పడం, వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిపోయాయి. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటించే అవకాశాలున్నాయని సమాచారం. 'లక్ష్మీ', 'తులసి' సినిమాలతో హిట్ పెయిర్ అనిపించుకొన్న జంట.. వెంకటేష్, నయనతార. వీళ్లిద్దరూ మళ్లీ వెండితెరపై సందడి చేస్తే హ్యాట్రిక్ కొట్టబోతున్నట్లే అంటున్నారు సినీ వర్గాలు.
ఇక ప్రస్తుతం తమిళంలో 'మాయ' చిత్రంలో నటిస్తోంది నయన. తెలుగులో 'మయూరి'గా విడుదల కాబోతోంది. 'అనామిక' తరవాత నయన చేస్తున్న తెలుగు చిత్రమిదే. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications











