బాడీగార్డ్ కి అంత సీన్ లేదని తేల్చేసిన వెంకటేష్
నేను సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ చూసాను. సల్మాన్ అధ్బుతంగా చేసాడు. అయితే నా సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని భావించటం లేదు. ఎందుకంటే మేము మళయాళం నుంచి కేవలం కాన్సెప్టు మాత్రమే తీసుకుని,చాలా మార్పులు చేసాము. తెలుగు ప్రేక్షకులుకు నచ్చే విధంగా చాలా ఎలిమెంట్స్ కలిపాము అంటున్నారు వెంకటేష్. ఆయన్ని తాజాగా కలిసి మీడియా హిందీలో వచ్చిన బాడీగార్డ్ సినిమా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా చోట్ల రిలీజ్ అయ్యింది కదా దాని ఎఫెక్టు మీ సినిమా మీద పడదా అంటే ఆయన ఇలా స్పందించారు. ఇక తెలుగులో ఆయన నటిస్తున్న చిత్రానికి గంగ...ది బాడీగార్డ్ అనే టైటిల్ ని పెట్టారు. డాన్ శీను తో పరిచయమైన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.
బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేస్తోంది. ఇంతకు ముందు బెల్లంకొండ నిర్మించిన నాగవల్లి చిత్రంలో చేసారు. అదీ రీమేకే కావటం విశేషం. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో వెంకటేష్ పూర్తిగా ఈ చిత్రం విజయం పైనే నమ్మకాలు పెట్టుకునే పరిస్ధితి ఏర్పడింది. అలాగే త్రిషకు కూడా ఈ చిత్రం కీలకమైందే.ఆమెకు ఇప్పుడు తెలుగులో ఒక్క చిత్రమూ లేదు. ఈ సినిమా హిట్టైతేనే ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.గోపీచంద్ మలినేని కూడా ఈ చిత్రం తనకు రెండో చిత్రం గండం అవకుండా బయిటపడుతుందా లేదా అన్నట్లు చూస్తున్నాడు. మర్యాద రామన్న చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంబించిన సలోనికి కూడా ఇది విడుదలతై కాస్త కెరిర్ లో కదలిక వస్తుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











