మళ్లీ తెరపైకి... వెంకటేష్-పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్
హైదరాబాద్: మన తెలుగు హీరోలకు మల్టీస్టారర్ చిత్రాలు అలవాటు లేదు. ఎందుకు చేయడం లేదని ఏ హీరోని అడిగినా సరైన కథ దొరకడం లేదని సమధానం ఇస్తుంటారు. అసలు లోపం కథ కాదు.. పెద్ద హిరోల ఇగో అనే వానద కూడా ఉంది. కథ తయారు చేసినా, మన పెద్ద హీరోలు ఒప్పకుంటారనే నమ్మకం లేదు. అందుకే కథా రచయితలు కూడా అలాంటి ఆలోచన చేయడం కూడా మానేసారు. అయితే ఇదంతా గతం.
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ల జోరందుకుంది. చిన్న చితకాల సంగతి పక్కన పెడితే... విక్టరీ వెంకటేష్ ఈ తరంలో మల్టీస్టారర్ చిత్రాలకు మళ్లీ ఊపు తెచ్చారని చెప్పొచ్చు. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్న వెంకటేష్, ఈ చిత్రం తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్‌తో కలిసి 'బోల్ బచ్చన్ బోల్' తెలుగు రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు.
తాజాగా అందుతున్న మరో విషయం ఏమిటంటే.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కూడా వెంకీ మరో మల్టీ స్టారర్ చిత్రం చేయాలని ఉవ్విల్లూరుతున్నాడట. ఈ వార్త చాలా కాలం క్రితమే వినిపించినా ఆచరణకు నోచుకోలేదు. వాస్తవానికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' పవన్ తో చేయాల్సిందే కానీ అతని డేట్స్ దొరకక పోవడం వల్ల మహేష్ బాబుతో కమిట్ అయ్యారనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే వెంకటేష్ పట్టువదలని విక్రమార్కుడిలా.... పవన్‌తో మల్టీస్టారర్ చేయించాల్సిందే అనే గట్టి పట్టుదలతో ఉన్నాడని, ఇటీవల రాణా సిస్టర్ మ్యారేజ్ సందర్భంగా కూడా ఇద్దరి మధ్య ఈ విషయమై చర్చ సాగిందని, త్వరలోనే ఈ విషయమై ఆసక్తికర వార్త వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్త నిజమయ్యేదెప్పుడో చూడాలి.


Click it and Unblock the Notifications











