పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి డాన్స్, ఫ్యాన్స్‌ కోసమే!

By Bojja Kumar

హైదరాబాద్: హిందీ చిత్రం 'ఓ మైగాడ్'ని తెలుగులో 'గోపాల గోపాల' టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ చిత్రం రీమేక్ అవుతోంది. హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేయగా, పరేష్ రావల్ పోషించిన వ్యాపారి పాత్రలో వెంకటేష్ నటించాడు.

ఇద్దరూ టాలీవుడ్లో స్టార్ హీరోలే కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఈ ఇద్దరిపై ఓ పాట కూడా ఉంది. వాస్తవానికి హిందీ వెర్షన్ లో పాట లేదు. కానీ, వెంకీ, పవన్ లు ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేస్తూ కనిపిస్తే చూడటానికి బావుంటుందనే అభిమానుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ పాటను రూపొందించారట.

Venkatesh, Pawan Kalyan set to take dance floor by storm

సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీక్షాపంథ్‌, మధుశాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్‌ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిముషాలేట. అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి పెంచారని సమాచారం.

ఈ చిత్రంలో శ్రియ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్‌, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: శరత్‌మరార్, సురేష్‌బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X