»   » సల్మాన్‌ ఖాన్‌తో వెంకటేష్ ఆప్యాయంగా....(సెల్ఫీ)

సల్మాన్‌ ఖాన్‌తో వెంకటేష్ ఆప్యాయంగా....(సెల్ఫీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 50వ పుట్టినరోజును ఈ సారి ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. సల్మాన్ ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీకి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అనిల్ కపూర్, రితేష్ దేశ్ ముఖ్, అమిషా పటేల్, కబీర్ ఖాన్, మలైకా అరోరా, సానియా మీర్జా తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ నుండి విక్టరీ వెంకటేష్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

దగ్గుబాటి ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్ కు చాలా కాలం నుండి మంచి రిలేషన్ షిప్ ఉంది. ముఖ్యంగా వెంకీతో సల్మాన్ చాలా క్లోజ్ గా ఉంటారు. బర్తే పార్టీలో సల్మాన్ ఖాన్ వెంకీ సెల్ఫీ దిగారు. దీన్ని ఆయన స్వయంగా తన ఫోస్ బుక్ ద్వారా అభిమానులుక షేర్ చేసారు. సల్మాన్ ఖాన్, వెంకటేష్ మధ్య ఆప్యాయత, అనుబంధం ఎలా ఉందో ఈ ఫోటోను చూసి అర్థం చేసుకోవచ్చు.

Venkatesh poses a selfie with Salman Bhai

ఈ పార్టీకి నటి అమీషా పటేల్ కూడా హాజరయ్యారు. అమీషా పటేల్ తో కలిసి దిగిన ఫోటో కూడా వెంకీ షేర్ చేసారు. బజరంగీ భాయిజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రాలతో హిట్ కొట్టడం, ఏళ్ల తరబడి సాగిన హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా బయట పడటంతో సల్మాన్ చాలా సంతోషంగా ఉన్నాడు.

Venkatesh poses a selfie with Salman Bhai

అర్ధరాత్రి నుంచే సల్మాన్ అభిమానులంతా ఆయన్ను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. సల్మాన్ ఖాన్ పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. డిసెంబర్ 27, 1965న జన్మించాడు. ప్రముఖ బాలీవుడ్ రచయిత సలీమ్ ఖాన్, ఆయన రెండో భార్య సుశీల చరక్ కుమారుడే సల్మాన్ ఖాన్.

English summary
Bollywood superstar Salman Khan celebrated his 50th birthday yesterday. While a lot of B-town celebs right from Anil Kapoor, Riteish Deshmukh, Amisha Patel, Kabir Khan, Malaika Arora, Sania Mirza and many others attended the bash, the real party began when Victory Venkatesh made his presence felt at this starry bash.
Please Wait while comments are loading...