'బిజినెస్ మ్యాన్'పై వెంకటేష్ కామెంట్స్

By Srikanya

మహేష్ బిజినెస్ మెన్ చిత్రం విడుదలైన మరుసటిరోజే వెంకటేష్ బాడీగార్డ్ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే రెండు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సందర్భంగా వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ...బిజినెస్ మ్యాన్ భాక్సాఫీస్ వద్ద బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ యూనిట్ సభ్యులను, మహేష్ కి కంగ్రాట్స్ అన్నారు. అలాగే తమ రెండు చిత్రాల సక్సెస్ అవ్వటం ఇండస్ట్రీకి కలిసి వచ్చే అంశం అన్నారు.

తాము ఇద్దరు కలిసి నటించే చిత్రం సీతమ్మ వాకిట్లో ఈ రెండిటి సక్సెస్ ని మించుతుందన్న ఆశా భావం వ్యక్తం చేసారు. ఇక మహేష్,వెంకటేష్ కాంబినేషన్ లో అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రం ప్రారంభం అయ్యింది. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తూండగా,వెంకటేష్ సరసన కొత్త అమ్మాయి నటిస్తోంది. ఈ చిత్రం ఇద్దరు అన్నదమ్ముల కథ. ప్రకాష్ రాజ్,జయప్రద ఈ చిత్రంలో వీరి తల్లి తండ్రులగా కనిపించనున్నారు. ఈ నెలలో షూటింగ్ వైజాగ్ లో ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X