మిగతా హీరోలతో పోలిస్తే మహేష్ బాబే ఆల్ రౌండర్...!
వెంకటేష్ నటిస్తున్న 'బాడీగార్డ్' సినిమా ఆడియో ఈ నెల 13న జరగనున్న విషయం తెలిసిందే.డిసెంబరు 13న వెంకటేష్ పుట్టిన రోజు కావడం విశేషం. శిల్ప కళా వేదికలో జరపనున్న ఈ వేడుకకి ప్రభాస్ మరియు వీవీ వినాయక్ అతిధులుగా విచ్చేయనున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యుల్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. వెంకటేష్ సరసన త్రిషా నటిస్తుండగా సలోని మరో కీలక పాత్ర పోషిస్తుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ఇది ఫ్రెష్ ఫీల్ తో వస్తున్న ఒక మంచి లవ్ స్టోరి. ఈ చిత్రం కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం. యాక్షన్, కామిడి సమపాలల్లో ఉన్నాయన్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి యాక్షన్ సినిమా చేసినందకు చాలా ఆనందంగా ఉందంటూ మహేష్ తో చేస్తున్న మల్టీస్టారర్ మూవీ గురించి మరికొన్ని మాటలతో ముచ్చటించారు..
హీరో మహేష్ బాబుపై సీనియర్ హీరో వెంకటేష్ ప్రశంసలు కురిపించారు. ఆ ఇద్దరూ కలిసి అన్నాతమ్ముళ్లుగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా సమంత నటిస్తోంది. తన సరసన నటించే నాయిక ఎవరనేది ఇంకా తేలలేదని వెంకటేష్ తెలిపారు.ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇద్దరు సోదరుల జీవిత ప్రయాణం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అన్నాతమ్ముళ్లుగా నేను, మహేష్ నటిస్తుండటం సంతోషంగా ఉంది. ఇద్దరం ఈ సినిమాలో చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇద్దరం ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం. సబ్జెక్ట్ విషయంలో, మా పాత్రల విషయంలో చాలా సంతోషంగా ఉన్నాం.
తెరపై చాలా అందంగా కనిపించే హీరోల్లో మహేష్ ఒకడు. చక్కని పెర్ఫార్మర్. అతని కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ మిగతా హీరోలతో పోలిస్తే భిన్నం. నా దృష్టిలో ఆల్ రౌండ్ యాక్టర్' అని ఆయన చెప్పారు. కాగా ఈ సినిమా షూటింగులో వెంకటేష్ ఈ నెల (డిసెంబర్) 16 నుంచి పాల్గొనబోతుండగా, మహేష్ 2012 జనవరి నుంచి పాల్గొనబోతున్నాడని తెలిపారు.


Click it and Unblock the Notifications











