వెంకటేష్-రామ్ ‘మసాలా’ లుక్ అదిరింది!
హైదరాబాద్ : వెంకటేష్, రామ్ హీరోలుగా బాలీవుడ్‌లో విజయం సాధించిన 'బోల్ బచ్చన్'కి రీమేక్‌గా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అంజలి, షాజన్ పదమ్‌సీ హీరోయిన్స్. విజయ్‌భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
ఈ చిత్రానికి 'మసాలా' అనే టైటిల్ ఖరారు చేసే యోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. తాజాగా సినిమా సెట్లో వెంటేష్-రామ్ లకు సంబంధించిన ఫోటో ఒకటి రిలీజ్ చేసారు. ఆ స్టిల్ చూస్తుంటే ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న సినిమాల ట్రెండుకు భిన్నంగా 'మసాలా' సినిమా ఉంటుందని స్పష్టం అవుతోంది.
ఇక మొదట ఈ చిత్రానికి 'గరమ్ మసాలా' అన్నారు. ఆ తరవాత అది 'గోల్ మాల్'గా సురేష్ బాబు చెప్పారు. ఈమధ్య 'బ్లాక్ బస్టర్' అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఇద్దరు హీరోలు కాబట్టి 'రామ్ బలరామ్' అనే పేరు పెడితే ఎలా ఉంటుంది? అని కూడా ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ' మసాలా' హీరోలు ఇద్దరికి నచ్చిందని కాబట్టి అదే ఓకే చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం టైటిల్ ఖరారు చేసి ప్రకటన చేసే అవకాసం ఉంది.
ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో రూపొందిన 'బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.


Click it and Unblock the Notifications











