For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెంకీ, రానా మల్టీస్టారర్.. నిర్మాతలుగా అబ్బాయి, బాబాయి.. కథ వింటే షాకే..

By Rajababu
|

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హవా మొదలైన నేపథ్యంలో దగ్గుబాటి వారసులు విక్టరీ వెంకటష్, యంగ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటిస్తే బాగుంటుందనే కోరిక ఫ్యాన్స్ నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారీ స్కీన్ మీద కాకున్న బుల్లితెరపై ఈ అబ్బాయి, బాబాయి కలిసి నటించనున్నరనే వార్త మీడియాలో జోరుగా షికారు చేస్తున్నది.

కృష్ణం వందేలో రానా, వెంకీ

కృష్ణం వందేలో రానా, వెంకీ

గతంలో రానా నటించిన కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో వెంకటేష్ అలా ఓ క్షణం మెరిసారు. దాంతో దగ్గుబాటి అభిమానులు ఖుషీ అయ్యారు. కానీ ఫ్యాన్స్ దిల్ మాంగే మోర్ అన్నారు.

విక్రం వేద చిత్రంలో కలిసి

విక్రం వేద చిత్రంలో కలిసి

ఆ తర్వాత తమిళంలో విజయం సాధించిన విక్రం వేద చిత్రంలో కలిసి నటిస్తున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు రూమర్లు, గాసిప్స్‌గానే మిగిలిపోయాయి.

కొలిక్కిరాని సురేష్‌బాబు ప్రయత్నాలు

కొలిక్కిరాని సురేష్‌బాబు ప్రయత్నాలు

వెంకటేష్, రానాను కలిపి తెరపై చూపించే ప్రయత్నాలను నిర్మాత సురేష్ బాబు చాలానే చేసినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఏదో కారణం చేత అవి సఫలం కాలేదు. కానీ తాజాగా వెంకీ, రానా కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించే కార్యక్రమానికి తెరలేసింది.

రాజీవ్ హత్య వెబ్ సిరీస్‌లో

రాజీవ్ హత్య వెబ్ సిరీస్‌లో

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంగా ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇందులో బాబాయిని కూడా భాగస్వామ్యం చేయడం విశేషం. అంతేకాకుండా వీరిద్దరూ నిర్మాతలుగా వ్యవహరించడం గమనార్హం.

కీలక పాత్రలో వెంకటేష్

కీలక పాత్రలో వెంకటేష్

ప్రస్తుత వెబ్ సిరీస్‌లో వెంకటేష్ కీలక పాత్రలో కలిసి నటించనున్నారు. సుమారు ఎపిసోడ్స్‌లో వెంకీ తన మార్క్ యాక్టింగ్‌ను పరిచయం చేయనున్నారు. ఇప్పటివరకు సినిమాలకే పరిమితమైన వెంకీ డైరెక్టుగా వెబ్‌ సిరీస్‌లో అడుగుపెట్టడం ఫ్యాన్స్‌ను ఆనందానికి గురిచేస్తున్నది.

ఏఎంఆర్ రమేశ్ దర్శకత్వం

ఏఎంఆర్ రమేశ్ దర్శకత్వం

ఎల్‌టీటీఈ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌కు ఏఎంఆర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కన్నడ, హిందీ, ఇంగ్లీస్, తమిళ, శ్రీలంక తమిళ భాషల్లో రూపొందనున్నది. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటుంది అని దర్శకుడు రమేశ్ వెల్లడించారు.

రానా దగ్గుబాటి వెన్నుదన్నుగా

రానా దగ్గుబాటి వెన్నుదన్నుగా

రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ చిత్రం కథను చెప్పడానికి చాలా సమయం అవసరం. సినిమాగా తెరకెక్కిస్తే అందులో ఉండే కీలక అంశాలు మరుగున పడిపోతాయి. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి వెన్నదన్ను అందిస్తున్నారు అని రమేశ్ చెప్పారు.

అంతర్జాతీయ స్థాయిలో ఎల్‌టీటీఈ

అంతర్జాతీయ స్థాయిలో ఎల్‌టీటీఈ

ఎల్‌టీటీఈ ప్రాజెక్ట్ ఓ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్. తొలిభాగంలో రాజీవ్ గాంధీ హత్యపై ఫోకస్ చేస్తాం. ఆ తర్వాత ఎల్‌టీటీఈ, దాని అధినేత వీ ప్రభాకరన్ జీవితంలోని కొన్ని అంశాలను తెరకెక్కిస్తాం.

ఐపీఎస్ ఆఫీసర్‌గా వెంకటేష్

ఐపీఎస్ ఆఫీసర్‌గా వెంకటేష్

రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ఐపీఎస్ అధికారి కార్తీకేయన్ పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రానా పోషించే పాత్ర చాలా కీలకమైంది అని రమేశ్ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు.

English summary
Rana Daggubati, his uncle Venkatesh may collaborate on a web series called LTTE. The first season will focus on the assassination of former PM Rajiv Gandhi, while the following seasons will see the rise of LTTE and the late former chief of the outfit, V Prabhakaran, said director Ramesh. Venkatesh playing the role of IPS officer Karthikeyan. Rana is going to play a vital role in the series as well,” Ramesh said.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more