»   » బాబాయ్-అబ్బాయ్ కాంబినేషన్లో సినిమా ఖరారైనట్లే!

బాబాయ్-అబ్బాయ్ కాంబినేషన్లో సినిమా ఖరారైనట్లే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, కీ.శే. రామానాయుడు వారసత్వంతో దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వెంకటేష్, రానాలు నటులుగా నిలదొక్కుకున్నారు. వెంకటేష్ తెలుగు టాప్ హీరోల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. రానా ఇప్పుడిప్పుడే నటనా రంగంలో పాతుకుపోవడానికి చాలా కష్టపడుతున్నాడు.

ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలని రామానాయుడు ఎప్పుడో ఆలోచన చేసారు కానీ దాన్ని ఆచరణలోకి తేక ముందే కాలం చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తనయుడు, నిర్మాత సురేష్ బాబు వెంకీ, రానా కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Venkatesh, Rana to team up

ఈ విషయమై రానా మాట్లాడుతూ.....బాబాయ్ వెంకటేష్ తో కలిసి త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. సరైన స్క్రిప్టు దొరికితో రానాతో కలిసి చేయడానికి సిద్దమే అని వెంకటేష్ కూడా గతంలో ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్క్రిప్టు ఓకే అయినట్లు తెలుస్తోంది.

బాబాయ్-అబ్బాయ్ బాడీ లాంగ్వేజ్.... వాళ్ల వాళ్ల స్టార్ ఇమేజ్‍‌కు తగిన విధంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. స్క్రిప్టు పూర్తి స్థాయిలో డెవలప్ అయిన తర్వాత సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. వీరి సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ లోనే చిత్రం నిర్మాణమయ్యే అవకాశం ఉంది.

English summary
Rana said that he will be teaming up for a multi starrer with his uncle, Venkatesh. Even Venky expressed his desire to team up with Rana and has been looking for a right script.
Please Wait while comments are loading...