రవితేజ, వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీ డీటేల్స్

By Bojja Kumar

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ ఈ మధ్య మల్టీస్టారర్ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, రామ్ తో కలిసి మసాలా, కమల్‌హాసన్ తో కలిసి ఈనాడు సినిమాలు చేసారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల చిత్రంలో నటిస్తున్నాడు.

త్వరలో మరో మల్టీస్టారర్ చిత్రానికి వెంకటేష్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆయన మాస్ మహారాజా రవితేజతో కలిసి చేయబోతున్నారు. బిందాస్, రగడ, దూసుకెళ్తా చిత్రాల ఫేం వీరుపోట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అన్నీ అనున్నట్లే జరిగితే ఈ ఏడాది చివరికల్లా సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారు.

Venkatesh - Ravi Teja multi-starrer on the cards

తమిళ చిత్రం ‘జిల్లా'కు రీమేక్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. మోహన్ లాల్, విజయ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం అక్కడ ఓ మోస్తరు విజయం సాధించింది. జిల్లాలో శివన్ అనే పాత్రను మోహన్ లాల్ పోషించారు. కథ ప్రకారం శివన్ ...మధురై ఏరియాలో ఓ డాన్. తన డ్రైవర్ ఓ పోలీస్ అధికారి చేతిలో చనిపోవటంతో అతను కుమారుడు శక్తి(విజయ్)ని పెంచుతాడు. శక్తి చిన్నప్పటి నుంచి పోలీసులను ద్వేషిస్తూ ఎదుగుతాడు. అయితే పెంచిన తండ్రి క్రైమ్ సిండికేట్ ని కాపాడటానికి శక్తి పోలీస్ గా జాయిన్ అవుతాడు. అక్కడ నుంచి కథ టర్న్ తీసుకుంటుంది. ఓ సంఘటనకు చలించిన శక్తి... పోలీసులకు సపోర్టర్ గా మారతాడు. అంతేగాక తన పెంచిన తండ్రిని మారటానికి ప్రయత్నాలు చేస్తూంటాడు...ఆ క్రమంలో ఏం జరిగిందనేది మిగతా కథ .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X