'నమో వెంకటేశ' నా పాత్ర ఏమిటంటే...వెంకటేష్
నమో వెంకటేశ చిత్రంలో నాది ఎంజాయబుల్, లవబుల్ క్యారెక్టరేజేషన్. కొంచెం అమాయకంగా కనిపిస్తూ, ఇంటెలిజెన్స్ చూపించే పాత్ర. సినిమా విషయానికొస్తే పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హాలీవుడ్ సినిమా 'సిండ్రెల్లా' టైప్ సింపుల్ లవ్ స్టోరీ. యూత్, మాస్, ఫ్యామిలీ అనే తేడాలేకుండా అందరికీ నచ్చే సినిమా. నాతో పాటు అందరి పాత్రలూ బాగుంటాయి. ఫస్టాఫ్ ఫారిన్‌లో, సెకండాఫ్ ఇక్కడా కథ నడుస్తుంది. అలాగే వెంకటేష్ ఈ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల గురించి చెబుతూ... శ్రీను పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఈ సినిమాని తీస్తున్నాడు. కామెడీ సినిమాలు చాలా చేశా. అయినా ఇందులో ఫ్రెష్ ఫీలింగ్ ఉండే కామెడీ చేయించాడు నాతో. చెప్పాలంటే కామెడీ సన్నివేశాల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లా. వాటిని పేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇక త్రిష హీరోయిన్ గా చేసేన ఈ చిత్రంలో బ్రహ్మానందం చేస్తున్న ప్యారిస్ ప్రసాద్ పాత్ర హైలెట్ అంటున్నారు. టోటల్ సినిమాలో వెంకటేష్ కున్నంత రోల్ బ్రహ్మానందంకు ఉంటుంది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ వెంట్రిక్వాలిజం చేస్తూ కనపడతారు. అతను విదేశాలలోను తెలుగు వారి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లతాడు. అక్కడ బ్రహ్మానందం కలుస్తాడు. అతని మేనకోడలు త్రిష. ఇక వీరిని ఆహ్వానించి,అక్కడ పోగ్రామ్ లు చూసే ఆర్గనైజర్ గా బ్రహ్మానందం బిల్డప్ లు ఇస్తూ వెంకటేష్ తో ఆడుకుంటాడు. పూర్తి స్ధాయి కామిడీ పండిస్తాడు.
ముఖ్యంగా సెకెండాఫ్ లో బ్రహ్మానందం, వెంకటేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హిలేరియస్ గా ఉంటాయని, రెగ్యులర్ గా శ్రీనువైట్ల సినిమాల్లో ఉండే త్రాగుడు సీన్ కూడా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఏదైమైనా వెంకటేష్ మరో సూపర్ హిట్ కు రెడీ అవుతున్నాడన్నమాట. సంక్రాతికి దీనిని రిలీజ్ చేసి నవ్వులు పండించనున్నారు. ఈ చిత్రాన్ని సుంకర అనీల్ కుమార్ నిర్మిస్తున్నారు. సురేష్ బాబు సమర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











