ప్రియమణితో వెంకటేష్ రొమాన్స్!
ఇప్పటికే విక్టరీ వెంకటేష్ తులసి, లక్ష్మీగా వచ్చి మంచి విజయాలు సాధించుకున్నాడు. ఆ మధ్య విడుదలైన నమో వెంకటేశ చిత్రం ఆయనకు కాస్త నిరాశే మిగిల్చింది. ఈ సారి మంచి యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ మూవీతో రావాలనే ఉద్దేశ్యంతో 'గంగా"గా అవతారం ఎత్తాడు వెంకీ. వెంటేష్ ప్రస్తుతం నటిస్తన్న గంగా ది బాడీగార్డ్ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. అక్టోబర్ 1న ఆడియో, అదే నెలలో 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే...లేటెస్టుగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత వెంకటేష్ దశరత్ దర్శకత్వంలో తన నెక్ట్స్ ప్రాజెక్టుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తూంది. ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి లీడ్ చేయనుంది. వెంకటేష్ తో ప్రియమణి జతకట్టడం ఇదే తొలి సారి. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కథా చర్చల దశలో ఉంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అప్పటి వరకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపించడం లేదు.
టాలీవుడ్ రేసులో ఈ మధ్య చాలా వెనకబడి పోయిన వెంకటేష్...ఈ సినిమాతో మళ్లీ తన పూర్వవైభవాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గంగా-ది బాడీగార్డు సక్సెస్ అయితే వెంకీ మరోసారి తెలుగు తెరపై వరుస సంచలనాలతో దూసుకెళతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











