»   » ఈ ఏడాది టాప్ హీరో వెంకటేష్!!

ఈ ఏడాది టాప్ హీరో వెంకటేష్!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చంటి, కలిసుందాం రా, పవిత్రబంధం వంటి చిత్రాలతో కుటుంబ కథానాయకుడిగా...లక్ష్మి, తులసి చిత్రాలతో మాస్ హీరోగా సమానమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు వెంకటేష్. దశాబ్దాలుగా తెలుగు తెరకు దూరమైన మల్టీస్టారర్ చిత్రాల ఒరవడిని 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పున: ప్రారంభించారు. విజయగర్వం ఇసుమంతైనా చూపించరు, అపజయాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. అదే వెంకటేష్ ప్రత్యేకత.

ప్రస్తుతం వెంకటేష్ వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మలయాళ సపర్ హిట్ ఫిల్మ్ 'దృశ్యం', హిందీలో ఘన విజయం సాధించిన 'ఓ మై గాడ్' చిత్రాల రీమేక్‌లతో పాటు యువ దర్శక సంచలనం మారుతి దర్శకత్వంలో 'రాధ' సినిమాలో నటిస్తున్న వెంకటేష్...ఈ మూడు చిత్రాలను 2014లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఓ అగ్ర కథానాయకుడి సినిమాలు సంవత్సరానికి రెండు విడుదలవ్వడమే గగనమైపోతున్న ఈ తరుణంలో...వెంకటేష్ తాను నటిస్తున్న మూడు చిత్రాలను ఇదే సంవత్సరం విడుదల చేయనుండటం ప్రత్యేకతను సంతరించుకుంటోంది. సోలో హీరోగా తన సినిమాలకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో...మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వెంకటేష్.

English summary

 Venkatesh has already announced three projects for this year. The three films that will release this year are ‘Radha’, ‘Drishyam’ remake and ‘Oh My God’ remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu