లేడీ గార్డ్‌ (బాడీగార్డ్ ప్రివ్యూ)

By Srikanya

మలయాళంలో విజయవంతమై తమిళ,హిందీ భాషల్లో రీమేకైన బాడీగార్డ్ చిత్రం ఇప్పుడు అదే పేరుతో వెంకటేష్ హిరోగా రీమేకై ఈ రోజు విడుదల అవుతోంది. డాన్ శీను తో డైరక్టర్ గా పరిచయమైన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్ ..త్రిషకు బాడీగార్డ్ వెంకటాద్రి గా కనిపించి అలరిస్తాడు. కథ ప్రకారం..పెద్దగా బాధ్యతలు లేనివాడు వెంకటాద్రి (వెంకటేష్‌).

ఒకప్పుడు కష్టకాలంలో తనకు సహాయం చేసిన వరదరాజులు నాయుడు (ప్రకాష్‌రాజ్‌)ని దేవుడిలా భావిస్తుంటాడు. ఆయన వెన్నంటే ఉండాలనుకొంటాడు. వెంకటాద్రి తెగువ తెలిసిన నాయుడు తన కూతురు కీర్తి (త్రిష)కి బాడీగార్డ్‌గా నియమిస్తాడు. అప్పట్నుంచి కీర్తి వెనకే కాలేజీకి వెళుతుంటాడు వెంకటాద్రి. అక్కడ అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వాటి పరిణామాలేమిటి? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి. ఇక ఈ చిత్రం గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. వెంకటేష్‌ శైలిలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథ ఇది. యాక్షన్‌ అంశాలు తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయని అన్నారు.

సంస్థ: శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌
నటీనటులు: వెంకటేష్‌, త్రిష, సలోని, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, అలీ, సుబ్బరాజు, ధర్మవరపు, వేణుమాధవ్‌, ప్రగతి తదితరులు
నిర్మాత: బెల్లంకొండ సురేష్‌
దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని
విడుదల: శనివారం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X