Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్‌రైజర్స్‌ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
వెంకటేష్ కూతురు పెళ్లి: సంగీత్‌లో రానా, చైతూ, సమంత హంగామా.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే
Recommended Video
విక్టరీ వెంకటేష్‌కు 2019 సంవత్సరం మంచి మధురస్మృతునలు నింపబోతున్నది. ఈ ఏడాది సంక్రాంతి రేసులో F2 చిత్రంతో బరిలో దిగిన వెంకీ భారీ హిట్‌ను అందుకొన్న సంగతి తెలిసిందే. ఇక వెంకటేష్‌కు మంచి సంతోషాన్ని ఈవెంట్ త్వరలో జరుగుబోతున్నది. తన కూతురు అశ్రిత వివాహం రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుగబోతున్నది. వివాహా తేదీలను గోప్యంగా పెట్టి ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నట్టు సమాచారం. అశ్రిత పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు..
బాయ్‌ఫ్రెండ్‌తో వెంకటేష్ కూతురు పెళ్లి
వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం తన బాయ్‌ఫ్రెండ్ వినాయక్ రెడ్డితో జరుగనున్నది. అశ్రిత, వినాయక్ రెడ్డి గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి ప్రేమ పెళ్లీ పీటల వద్దకు చేరుకోబోతున్నది. ప్రైవేట్ కార్యక్రమంగా జరుగుతున్న ఈ పెళ్లి ఏర్పాట్లు చాలా సీక్రెట్‌గా నిర్వహిస్తున్నట్టు సమాచారం.
రాజస్థాన్‌లోనే డిస్టినేషన్ వెడ్డింగ్
అశ్రిత సన్నిహితులు వెల్లడించిన ప్రకారం.. ఈ డిస్టినేషన్ వెడ్డింగ్‌ను రాజస్థాన్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ పెళ్లిలో భాగంగా జరిగే సంగీత్ కార్యక్రమానికి బ్రహ్మండంగా ఏర్పాట్లు చేస్తున్నారట. రానా దగ్గుబాటి, నాగచైతన్య, సమంత అక్కినేని ఇప్పటికే ఈ పెళ్లి సంగీత్‌లో అదరగొట్టే డ్యాన్సులు చేయడానికి సిద్ధంగా ఉన్నారట.
జైపూర్‌లో పెళ్లికి ఏర్పాట్లు
దగ్గుబాటి కుటుంబ వ్యవహారంగా జరిగే పెళ్లికి వెడ్డింగ్ కార్డులు కూడా పంచేశారట. అతికొద్ది మంది కుటుంబ స్నేహితులు, సన్నిహితులకు వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలు అందినట్టు తెలిసింది. జైపూర్ వేదికగా ఈ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. పెళ్లి అనంతరం సినీ, వ్యాపార ప్రముఖులకు భారీగా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
వినాయక్ రెడ్డి కుటుంబ నేపథ్యం
హీరో వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం చేసుకోబోయే వినాయక్ రాజకీయ నేపథ్యం ఉంది. వినాయక్ తాత రామసహాయం సురేందర్ రెడ్డి పలుమార్లు వరంగల్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
వ్యాపార రంగంలోకి అశ్రిత
వెంకటేష్ కుమార్తె అశ్రిత ప్రొఫెషనల్ బేకర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ఫినిటీ ప్లాటర్ బ్రాండ్ నేమ్‌తో సొంత వ్యాపారంలో ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఇన్ఫినిటి ప్లాటర్ విభాగాలను ఏర్పాటు బిజినెస్ రంగంలో యువ వ్యాపారవేత్తగా దూసుకెళ్తున్నట్టు కుటుంబ సన్నిహితులు వెల్లడించారు.