వెంకటేష్ కూతురు పెళ్లి: జైపూర్‌లో సల్మాన్, రాంచరణ్ హల్‌చల్.. ఎవరెవరు వచ్చారంటే..
దగ్గుబాటి నట వారసుడు, విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహానికి జైపూర్ వేదికైంది. దేశ సినీ పరిశ్రమలో గొప్పగా చెప్పుకొనే విధంగా మారబోతున్న ఈ పెళ్లి కోసం ఇప్పటికే బాలీవుడ్, దక్షిణాది ప్రముఖులు జైపూర్‌కు చేరుకొంటున్నారు. ఈ పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి ఎవరెవరూ హాజరవుతున్నారు? ఈ వివాహంలో విశేషాలు ఏమిటంటే..

రాజస్థానీ, హిందూ వివాహ పద్దతిలో
వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ రామసహాయం సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జైపూర్‌లో మార్చి 24న జరుగనున్నది. ఈ పెళ్లి కోసం, అతిథుల బస కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. హిందీ, దక్షిణాది సినిమా ప్రముఖులు భారీగా హాజరవ్వనున్నారు. ఈ పెళ్లిని రాజస్థానీ స్టయిల్‌లో హిందూ మతాచారం ప్రకారం జరిపించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది.

సల్మాన్ ఖాన్ బృందం హంగామా
బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, ఆయనతో మైనే ప్యార్ క్యో కియా చిత్రంలో నటించిన బినా కక్, సల్మాన్ స్నేహితుడు.. గాయకుడు కమల్ ఖాన్ పెళ్లికి హాజరయ్యారు. వీరిద్దరిని సంగీత్ కోసం ప్రత్యేకంగా పిలిపించినట్టు తెలిసింది.

వెడ్డింగ్ చిల్లింగ్ అంటూ సమంత
శనివారం ఉదయమే జైపూర్‌కు చేరుకొన్న సమంత, నాగచైతన్య మీడియాకు ఫోజిచ్చారు. వెడ్డింగ్ చిల్లింగ్ అంటూ తమ సోషల్ మీడియాలో ఫొటోను పోస్టు చేశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో సంగీతం కోసం ప్రత్యేకంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే.

సల్మాన్, చెర్రీ హల్‌చల్
అశ్రిత, వినాయక్ రెడ్డి పెళ్లి కోసం రాంచరణ్ శనివారమే జైపూర్‌కు చేరుకొన్నారు. రాంచరణ్‌ను ఎయిర్‌పోర్టులో మీడియా ఫొటోగ్రాఫర్లు వెంటాడారు. ఈ సంగీత్‌లో రానాతో కలిసి రాంచరణ్ డ్యాన్సులతో ఇరుగదీసినట్టు తెలిసింది. సంగీత్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా రాంచరణ్ కనిపించడమే కాకుండా.. తన స్నేహితుడు సల్మాన్‌త తెగ హడావిడి చేసినట్టు సమాచారం.

రానా, చైతూ, సమంత సంగీత్‌లో
శనివారం జరిగిన సంగీత్ కార్యక్రమంలో రానా, చైతూ, సమంత, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ బృందం చేసిన డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. పెళ్లి కూతురు, కుమారుడికి సంబంధించిన ఫొటోలను చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఆదివారం వాటిని మీడియాకు రిలీజ్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











